Elon Musk : టెస్లా రిమోట్ బ్రాంచ్ ఆఫీస్ కాదు

స్ప‌ష్టం చేసిన టెస్లా సిఇఓ మ‌స్క్

Elon Musk : ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా పేరొందిన ప్ర‌ముఖ విద్యుత్ కార్ల సంస్థ టెస్లా సిఇఓ ఎలోన్ మ‌స్క్(Elon Musk) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న రిమోట్ వ‌ర్క్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఎవ‌రైనా స‌రే ఏ స్థాయిలో ఉన్న వారైనా ప‌ని ప‌ట్ల నిబ‌ద్ద‌త ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేస్తారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా కార‌ణంగా రిమోట్ వ‌ర్క్ కు ప‌రిమిత‌మైన వారంతా ఇంకో సాకుతో ఇంటి వ‌ద్ద నుండి ప‌ని చేస్తామంటే తాను ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేశారు.

ఒక ర‌కంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌న సంస్థ‌లో ప‌ని చేస్తున్న సిబ్బందిని హెచ్చ‌రించారు. టెస్లా కు సంబంధించి ఆఫీసుకు వెళ్లండి లేదా కాద‌నుకుంటే బ‌య‌ట‌కు వెళ్లండి అంటూ నిర్మోహ‌మాటంగా స్ప‌ష్టం చేశాడు ఎలోన్ మ‌స్క్.

ఉద్యోగ విధుల‌తో సంబంధం లేని రిమోట్ బ్రాంచ్ ఆఫీస్ కాదు టెస్లా సంస్థ అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌కం రేపాయి. కాగా ఉద్యోగుల ప‌ట్ల ఎలోన్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం అన్న‌ది ఇదే కొత్త‌ది కాదు ఇదే చివ‌రిది కాదు.

ఆ విష‌యం ఆయ‌న సంస్థ‌లో ప‌ని చేస్తున్న కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు. అందుకే ఎప్పుడు ఎలాంటి క‌ఠిన‌మైన నిర్ణ‌యం ఎలోన్ మ‌స్క్ తీసుకుంటారోన‌ని బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వ‌హిస్తారు.

తాజాగా టెస్లా చీఫ్ ఎగ్జిటివ్ ఆఫీస‌ర్ గా ఉన్న మ‌స్క్(Elon Musk ) ట్విట్ట‌ర్ లో రిట‌ర్న్ టు ఆఫీస్ డిబేట్ లోకి ప్ర‌వేశించాడు. ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఎల‌క్ట్రిక్ కార్ మేక‌ర్ కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి తాను పంపించిన ఇమెయిల్ గురించి వివ‌రించారు.

Also Read : ఐటీలో తెలంగాణ ముందంజ దేశం వెనుకంజ‌

Leave A Reply

Your Email Id will not be published!