ENG vs NZ 1St Test : జో రూట్ సెంచ‌రీ ఇంగ్లాండ్ విక్ట‌రీ

5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై గెలుపు

ENG vs NZ 1St Test : లార్డ్స్ లో న్యూజిలాండ్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ అజేయ సెంచ‌రీతో జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

త‌న టెస్టు కెరీర్ లో 10,000 వేల ప‌రుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఇంగ్లాండ్ ఆట‌గాడు. జో రూట్ స్థానంలో నాయ‌కుడిగా ఎంపికైన బెన్ స్టోక్స్ సైతం రాణించాడు.

కీల‌క‌మైన 54 ప‌రుగులు చేశాడు. దీంతో ఒక రోజు కంటే ఎక్కువ స‌మ‌యం ఉండ‌గానే ఇంగ్లాండ్ విక్ట‌రీ సాధించింది. ప్ర‌స్తుత టెస్ట్ ఛాంపియ‌న్ తో జ‌రిగిన మూడు మ్యాచ్ ల సీరీస్ లో ఇంగ్లండ్ 1-0 తేడాదో ఆధిక్యంలో నిలిచింది.

గెలిచేందుకు న్యూజిలాండ్ ఇంగ్లండ్(ENG vs NZ 1St Test) ముందు 277 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందుంచింది. బ‌రిలోకి దిగిన ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్ల‌ను కోల్పోయింది.

69 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ ను మాజీ కెప్టెన్ జో రూట్ , ప్ర‌స్తుత కెప్టెన్ బెన్ స్టోక్స్ క‌లిసి గ‌ట్టెక్కించారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

5వ వికెట్ గా స్టోక్స్ వెనుదిరిగాడు. 54 కీల‌క ప‌రుగులు చేశాడు. జో రూట్ తో క‌లిసి స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టించారు. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ , బ్యాట‌ర్ బెన్ ఫోక్స్ చ‌క్క‌గా ఆడాడు.

32 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్ కు 120 ప‌రుగులు చేశారు. అలెస్ట ర్ కుక్ 10 వేల ప‌రుగుల్ని 31 ఏళ్ల 157 రోజుల కింద‌ట సాధించాడు.

దానిని జో రూట్ ఇప్పుడు 2022లో అధిగ‌మించాడు. అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు.

Also Read : జో రూట్ ఆట తీరు అద్భుతం – గంగూలీ

Leave A Reply

Your Email Id will not be published!