ENG vs NZ 3rd Test : విజయానికి అడుగు దూరంలో ఇంగ్లండ్
బ్యాటర్ల ధాటికి చేతులెత్తేసిన న్యూజిలాండ్
ENG vs NZ 3rd Test : ఇంగ్లండ్ న్యూజిలాండ్(ENG vs NZ 3rd Test) పై విజయం సాధించేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే మొదటి, రెండో టెస్టులలో సత్తా చాటింది. కీవీస్ కు చుక్కలు చూపించింది.
ముచ్చటగా హెడింగ్లీలో జరుగుతున్న మూడో టెస్టులో సైతం గెలుపు సాధించేందుకు పరుగులు తీస్తోంది. ఏదో అద్భుతం జరిగితే తప్పా కీవీస్ ఓటమి నుంచి గట్టెక్కే ఛాన్స్ లేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆలీ పోప్, మాజీ కెప్టెన్ జో రూట్ దుమ్ము రేపారు. క్లీన్ స్వీప్ చేసేందుకు మార్గం సుగమం చేశారు వీరిద్దరూ. నాలుగో రోజు జో రూట్ , ఆలీ పోప్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు.
ఇక జాక్ లీచ్ తన కెరీర్ లో మొదటిసారిగా ఒక టెస్టులో 10 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్(ENG vs NZ 3rd Test) జట్టు పటిష్ట స్థితిలో ఉంది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 183 పరుగులు చేసింది.
సోమవారం చివరి రోజు 296 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకా కేవలం 113 పరుగులు చేయాల్సి ఉంది. మరోసారి పోప్ దుమ్ము రేపాడు. 81 పరుగులు చేసి సెంచరీకి చేరులో ఉన్నాడు.
జో రూట్ అతని హోమ్ గ్రౌండ్ లో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మూడో వికెట్ కు వీరిద్దరూ కలిసి 132 పరుగులు చేశారు. ఇప్పటి దాకా టెస్టు ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న న్యూజిలాండ్ కు ఘోర పరాభవం ఇది.
ఇక జో రూట్ కెప్టెన్ గా విఫలమయ్యాడు. కానీ ఆటగాడిగా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. 2021లో 1,708 పరుగులు చేశాడు.
Also Read : ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం