ENG vs NZ 3rd Test : మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ దే విక్టరీ
దంచి కొట్టిన బెయిర్ స్టో
ENG vs NZ 3rd Test : పర్యాటక న్యూజిలాండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్(ENG vs NZ 3rd Test). మూడు టెస్టుల సీరీస్ లో మూడు మ్యాచ్ లను ఊడ్చేసింది ఆతిథ్య జట్టు. చివరకు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. హెడింగ్లే వేదికగా జరిగిన ఆఖరి టెస్టు విజయంతో ముగించింది.
ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కీవీస్ 296 పరుగుల టార్గెట్ ముందుంచింది . 183 పరుగులతో ప్రారంభించింది ఇంగ్లండ్. మూడు వికెట్ల తోనే పని పూర్తి కానిచ్చేసింది.
ఓలీ పోప్ 82 రన్స్ చేసి సత్తా చాటాడు. ఇక మాజీ కెప్టెన్ జో రూట్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 85 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. చివరి దాకా
నాటౌట్ గా నిలిచాడు.
బెయిర్ స్టో షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. టి20 మ్యాచ్ ను తలపింప చేశాడు. కేవలం 44 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బెయిర్ స్టో 9 ఫోర్లు
ఓ సిక్స్ తో సత్తా చాటాడు.
71 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో అనుకున్న లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించారు. ఇదిలా ఉండగా స్టో ఫస్ట్ ఇన్నింగ్స్ లోనూ
న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు.
24 ఫోర్లతో 162 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ ఇదే ఆట తీరును ప్రదర్శించాడు. ఏకోశాన న్యూజిలాండ్ బౌలర్లు ప్రభావం చూపలేక పోయారు.
ఒక రకంగా చెప్పాలంటే చేతులెత్తేశారు. బెయిర్ స్టో కొట్టిన షాట్స్ కు చూస్తూ ఉండి పోయారు. ఈ సీరీస్ లో రెండు సెంచరీలు ఓ హాఫ్ సెంచరీ కొట్టాడు.
న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 329 రన్స్ చేస్తే ఇంగ్లండ్ 360 చేసింది. ఇక కీవీస్ రెండో ఇన్నింగ్స్ లో 326 రన్స్ చేస్తే , ఇంగ్లండ్ 296 పరుగులు
చేసి సత్తా చాటింది.
Also Read : మూడో టి20లో శ్రీలంక గ్రాండ్ విక్టరీ