Team India Practice : ప్రాక్టీస్ లో భారత ఆటగాళ్లు నిమగ్నం
ఐదో టెస్టుకు ఇంగ్లండ్ తో అమీ తుమీ
Team India Practice : ఇంగ్లండ్ టూర్ లో భాగంగా టెస్టుతో పాటు వన్డే, టి20 మ్యాచ్ లు ఆడేందుకు భారత జట్టు భారీగా కసరత్తు చేస్తోంది. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి పోయారు. హెడ్ కోచ్ , ఫిజికల్ ట్రైనర్స్ ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఇదిలా ఉండగా ఆటపై ఫోకస్ పెట్టేందుకు మునిగి పోయారు. ఇంగ్లండ్ తో జరిగే టెస్టు మ్యాచ్ కంటే ముందు భారత జట్టు లీసెస్టర్ షైర్ ప్రాక్టీస్ గేమ్(Team India Practice) ఆడుతుంది. ఇందుకు గాను శిక్షణ లో మునిగి తేలుతున్నారు.
ఇక విరాట్ కోహ్లీ తన ఫుట్ బాల్ నైపుణ్యాలను చాటుకున్నాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ , చెతేశ్వర్ పుజారా, మహ్మద్ షమీ సైతం ప్రాక్టీస్(Team India Practice) లో లీనమయ్యారు.
టూర్ లో భాగంగా భారత జట్టు జూలై 1 నుంచి బర్మింగ్ హోమ్ లో ఇంగ్లండ్ తో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ కు గాను నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడి ఐదో మ్యాచ్ ఆడకుండా వదిలేసి వచ్చింది.
దీంతో ఆ టెస్టు మ్యాచ్ ను ఇప్పుడు ఆడుతోంది భారత జట్టు. ఇక ఇంగ్లండ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు దుమ్ము రేపుతోంది. ప్రధాన ఆటగాళ్లు దంచి కొడుతున్నారు. స్వదేశంలో జరిగిన టెస్టు సీరీస్ ను గెలుచుకుంది.
న్యూజిలాండ్ కు చుక్కలు చూపించింది ఇంగ్లండ్ . జోస్ బట్లర్ , బెన్ స్టోక్స్ , పోప్ సత్తా చాటుతున్నారు. ఇండియా ఇంగ్లండ్ తో తీవ్ర పోటీ ఎదుర్కొననుంది.
ఇక ఇప్పటికే ఇంగ్లండ్ లోనే ఉంటూ కౌంటీలలో ఆడుతూ సత్తా చాటిన చతేశ్వర్ పుజారా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు జట్టుకు ఇది అదనపు బలమేనని చెప్పక తప్పదు.
Also Read : టీ20 వరల్డ్ కప్ జట్ల ఎంపికకు డెడ్ లైన్