England Victory : చెప్పారు ఇండియాను చితక్కొట్టారు
ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం
England Victory : ఎవరైనా చెప్పి కొడతారా..కానీ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం చెప్పి మరీ భారత్ కు చుక్కలు(England Victory) చూపించాడు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడిని పంపిస్తే చాలు తాము గెలిచినట్టేనని కామెంట్ చేశాడు. కానీ భారత్ ను ఆదిలోనే కట్టడి చేశాడు. కేఎల్ రాహుల్ ఎప్పటి లాగే 5 రన్స్ కే వెనుదిరిగితే..ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 27 రన్స్ చేశాడు.
ఈ తరుణంలో వచ్చిన రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. ఇక దుమ్ము రేపుతూ వస్తున్న స్టార్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్ భారీ షాట్ కు పోయి 14 పరుగులకే చాప చుట్టేశాడు. ఈ తరుణంలో హార్దిక్ పాండ్యా, రన్ మెషీన్ కోహ్లీ అద్భుతంగా ఆడారు. భారీ స్కోర్ దిశగా తీసుకు వెళ్లారు. ఈ స్కోర్ అడిలైడ్ లో మామూలు కాదు. 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
కోహ్లీ 50 రన్స్ చేస్తే పాండ్యా 64 పరుగులతో సత్తా చాటారు. ఈ తరుణంలో 169 పరుగుల భారీ స్కోర్ ను ఆడుతూ పాడుతూ ఛేదించారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. ప్రధానంగా కెప్టెన్ జోస్ బట్లర్ , హేల్స్ ఓపెనర్లే మొత్తం మ్యాచ్ ను ముగించేశారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చి పోయారు(England Victory).
జోస్ బట్లర్ జోష్ పెంచితే హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రతీ బౌలర్ ను ఉతికేశారు. అర్ష్ దిప్ సింగ్ , షమీ, భువనేశ్వర్ కుమార్ ల భరతం పట్టారు. అక్షర్ పటేల్ , అశ్విన్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు. వీరిద్దరిని సాగ నంపేందుకు కెప్టెన్ రోహిత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు.
చివరకు 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇంటి బాట పట్టారు. ఆ ఇద్దరూ రెచ్చి పోయి ఆడుతుంటే చేష్టలుడిగి పోయారు.
Also Read : ఇంగ్లండ్ భళా ఇండియా విలవిల