Harry Kane : ఆర్సీబీ నా ఫెవ‌రేట్ టీం – హ్యారీ కేన్

ఇంగ్లండ్ ఫుట్ బాట్ టీం కెప్టెన్

Harry Kane  : ఎవ‌రీ హ్యారీ కేన్ అనుకుంటున్నారా. మోస్ట్ పాపుల‌ర్ ఇంగ్లండ్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్. దిగ్గ‌జ ఆట‌గాడిగా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు ఆ దేశానికి సంబంధించిన ఫుట్ బాల్ జ‌ట్టుకు ప్ర‌స్తుతం కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

మ‌నోడికి క్రికెట్ అంటే కూడా అభిమానం. ప్ర‌త్యేకించి ఐపీఎల్ మ్యాచ్ లు చూడ‌డం అంటే స‌ర‌దా. తాజాగా ఐపీఎల్ 2022లో రిచ్ మెగా లీగ్ లో ఆర్సీబీ నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది.

ఈ త‌రుణంలో హ్యారీ కేన్ (Harry Kane )ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న ఫెవ‌రేట్ టీం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అని, ఆ జ‌ట్టుకే ఐపీఎల్ టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంద‌న్నాడు.

మ‌నోడికి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ‌తంలో ఫుట్ బాల్ సీజ‌న్ లో త‌న టోటెన్ హోమ్ హాట్ స్ పుర్ స‌హ‌చ‌రుల‌తో క‌లిసి క్రికెట్ కూడా ఆడాడు.

ఆర్సీబీ ఎంత ఆద్భుతంగా ఆడుతుందో చెప్పాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో త‌ను భేటీ అయిన విష‌యం గురించి కూడా పంచుకున్నాడు.

ఈ సంద‌ర్బంగా ఓ స్పోర్ట్స్ ఛాన‌ల్ తో మాట్లాడాడు హ్యారీ కేన్ . ఐపీఎల్ లో ఎన్ని జ‌ట్లు ఉన్నా ఆర్సీబీనే నా అభిమాన జ‌ట్టు. గ‌త సంవ‌త్స‌రం వారికి ల‌క్ క‌లిసి రాలేద‌న్నాడు.

కానీ ఈసారి అద్భుతంగా రాణి్స్తున్నాడ‌ని పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఈసారి జ‌రిగే ఐపీల్ టైటిల్ ను త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

Also Read : నో బాల్ వ్య‌వ‌హారంపై ఐపీఎల్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!