ENGW vs NZW : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ -2022 లో భాగంగా న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ పోరులో ఇంగ్లండ్ సత్తా చాటింది.
ఆతిథ్య కీవీస్ జట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. కీలక మ్యాచ్ లో ఇంగ్లండ్ స్కీప్పర్ హీథర్ నైట్(ENGW vs NZW) కళ్లు చెదిరే క్యాచ్ తీసుకుని విస్తు పోయేలా చేసింది ప్రత్యర్థి జట్టును.
కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండర్ స్కివర్ సత్తా చాటింది. తన ఆట తీరుతో ఆకట్టుకుంది. జట్టు విజయంలో కీలక భూమిక పోషించంది.
61 పరుగులు చేసింది. 204 టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పై కీవీస్ బౌలర్లు ప్రతాపం చూపారు. ఆరంభం లోనే ఓపెనర్ డేనియల్ వ్యాట్ ను కోల్పోయింది.
ఈ తరుణంలో క్రీజు లోకి వచ్చిన బ్యూమాంట్ , కెప్టెన్ హీతర్ నైట్ 36 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను కుదుట పరిచేలా చేశారు. ఆ తర్వాత వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది.
ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన స్కివర్ కళ్లు చెదిరే షాట్స్ తో దాడి చేసింది. దీంతో కీవీస్ కెప్టెన్ ఎన్ని సార్లు బౌలర్లను మార్చినా ఫలితం లేక పోయింది.
స్కివర్ అనుకోకుండా అవుట్ కావడంతో మ్యాచ్ కీవీస్ చేతిలోకి వెళ్లింది. ఆ తర్వాత వరుసగా నాలుగు వికెట్లను పారేసుకుంది ఇంగ్లండ్.
ఇంక ఒక్క వికెట్ దూరంలో ఉన్న కీవీస్ ఆశలపై నీళ్లు చల్లింది ఇంగ్లండ్ బ్యాటర్ (ENGW vs NZW)అన్య ష్రూబ్సోలీ. వికెట్ పోకుండా జట్టును గెలిపించింది.
Also Read : విండీస్ స్కిప్పర్ అరుదైన ఘనత