ENGW vs SAW WC 2022 : వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు ఇంగ్లండ్

ఇంటి దారి ప‌ట్టిన స‌ఫారీ

ENGW vs SAW WC 2022 : ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో చివ‌రి అంకమే ఇక మిగిలింది. ఓ వైపు ఒక్క ఓట‌మి అంటూ ఎరుగ‌ని ఆస్ట్రేలియా విమెన్స్ టీం ఫైన‌ల్ కు చేరింది. దీంతో ఎవ‌రు రెండో ప్ర‌త్య‌ర్థి అన్న‌ది తేలి పోయింది.

ఇంగ్లండ్ ఊహించ‌ని రీతిలో స‌ఫారీ టీంకు షాక్ ఇచ్చింది. ఫైన‌ల్ కు చేరింది. ఆదివారం నాడు జ‌రిగే ఫైన‌ల్ పోరులో ఆసిస్ తో త‌ల‌ప‌డ‌నుంది ఇంగ్లండ్.

సెమీ ఫైన‌ల్ లో జ‌రిగిన మ్యాచ్ లో ఏకంగా ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు 137 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.

ప్ర‌స్తుతం డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న ఇంగ్లండ్ ఇప్ప‌టికే నాలుగు సార్లు క‌ప్ ను స్వంతం చేసుకుంది ఆ టీం.

గ‌తంలో కంటే భిన్నంగా ఈసారి ఇంగ్లండ్ ఏమంత మెరుగైన ఆట తీరు ప్ర‌ద‌ర్శించ లేదు మొద‌ట్లో . తొలి మూడు మ్యాచ్ ల‌లోనే పేల‌వంగా ఆడింది.

విమ‌ర్శ‌ల్ని త‌ట్టుకుని చివ‌రి మ్యాచ్ ల‌లో గెలుచుకుంటూ మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ను చేజిక్కించుకునేందుకు రెడీ అవుతోంది ఇంగ్లండ్.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ద‌క్షిణాఫ్రికా టాస్ (ENGW vs SAW WC 2022)గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

దీంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 293 ప‌రుగులు చేసింది. బిగ్ స్కోర్ సాధించింది. వ్యాట్ దుమ్ము రేపింది. 125 బంతులు ఆడి 129 ర‌న్స్ చేఇసంది.

డ‌న్ క్లీ 72 బంతులు ఆడి 60 ర‌న్స్ చేసింది. వీరిద్ద‌రూ క‌లిసి 116 ప‌రుగులు చేయ‌డం విశేషం. అనంత‌రం బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా ఇంగ్లండ్ (ENGW vs SAW WC 2022)బౌల‌ర్ల ధాటికి 38 ఓవ‌ర్ల‌లోనే 156 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.

బౌల‌ర్ సోఫీ ఎకెల్ స్టోన్ మ్యాచ్ ను తిప్పేసింది. త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో ఏకంగా 36 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టింది.

Also Read : హ‌స‌రంగ రియ‌ల్ ఛాంపియ‌న్ – చ‌హ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!