Sunil Gavaskar : భారత క్రికెట్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ రంగమే కాదు యావత్ క్రీడా ప్రపంచం ఆసిస్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణంను తట్టుకోలేక పోతోంది.
ఈ తరుణంలో ఇటీవల జరిగిన చర్చా వేదికలో వార్న్ , మురళీధరన్ లలో ఎవరు గొప్ప అనే అంశంపై స్పందించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో ఆడే సమయంలో వార్న్ కెరీర్ బాగానే ఉన్నా ఇండియా వరకు వచ్చే సరికల్లా పూర్ పర్ ఫార్మెన్స్ ఉందని కామెంట్ చేశాడు.
అంతే కాకుండా సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) వివాదాస్పద కామెంట్స్ చేశారు. షేన్ వార్న్ కంటే మురళీధరన్ గొప్ప బౌలర్ అంటూ స్పష్టం చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
దీనిపై ఆస్ట్రేలియా మీడియా తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. ఒక రకంగా సన్నీని ఏకి పారేసింది. ఒక పరిణతి చెందిన ఆటగాడు మాట్లాడాల్సిన మాటలు కాదని పేర్కొన్నాయి.
షేన్ వార్న్ చని పోయి విషాదంలో ఉంటే ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ అవసరమా అని ఎద్దేవా చేశాయి. ఇండియా టుడే చర్చలో గవాస్కర్. వార్న్ కంటే ముత్తయ్య మురళీధరన్ బెటర్ అంటూ పేర్కొన్నాడు.
టీమిండియాపై వార్న్ పేలవమైన ప్రదర్శన ఉందని కానీ మురళీధరన్ ప్రదర్శన భారత్ పై బాగుందన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య మురళీనే టాప్ గా పరిగణిస్తామని చెప్పాడు.
36 రన్స్ చేసేందుకు 174 బాల్స్ ఆడిన నీవు ఈ సమయంలో ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించాయి ఆసిస్ మీడియా.
Also Read : 26 నుంచి ఐపీఎల్ సంబురం షురూ