Eoin Morgan : ఇయాన్ మోర్గాన్ ‘ఇన్నోవేట‌ర్..మోటివేట‌ర్’

ఇంగ్లండ్ క్రికెట్ లో అరుదైన క్రికెట‌ర్

Eoin Morgan : ప్ర‌పంచ క్రికెట్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న క్రికెట‌ర్ ఇంగ్లండ్ కు చెందిన ఇయాన్ మోర్గాన్(Eoin Morgan). ఒక ర‌కంగా ఇంగ్లిష్ క్రికెట్ లో పెను మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాడు.

కొత్త వారిని ప్రోత్స‌హించాడు. తాను ముందుండి వాళ్ల‌ను న‌డిపించాడు. క్రికెట‌ర్ గా, కెప్టెన్ గా అంత‌కు మించిన మోటివేట‌ర్ గా మోర్గాన్ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

చాలా మంది ఆట‌గాళ్లు క్రికెట్ కోస‌మే ఆడ‌తారు. కానీ ఇయాన్ క్రికెట్ ను ప్రాణ ప‌దంగా ప్రేమించాడు. ఇంగ్లండ్ క్రికెట్ కు సంబంధించి వ‌న్డే

క్రికెట్ లో ఆ జ‌ట్టు 44 ఏళ్ల నుంచి కంటూ వ‌స్తున్న క‌ల‌ను సాకారం చేసిన అరుదైన క్రికెట‌ర్ ఇయాన్ మోర్గాన్.

2019లో ఇంగ్లండ్ ను త‌న సార‌థ్యంలో వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించి పెట్టాడు. ఇది అపూర్వ‌మైన స‌న్నివేశం. అందుకే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అత‌డిని గొప్ప విజ‌న్ ఉన్న నాయ‌కుడు మాత్ర‌మే కాద‌ని నిత్యం స్పూర్తి దాయ‌క‌మైన వ్య‌క్తి అంటూ కితాబు ఇచ్చింది.

ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు త‌మ ఆట నుంచి నిష్క్ర‌మించారు. కానీ ఇయాన్ మోర్గాన్ త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంపై క్రీడాభిమానులు

జీర్ణించు కోలేక పోతున్నారు.

ప్ర‌పంచాన్ని క‌ట్టి పడేస్తున్న క్రికెట్ లో చాలా అరుదుగా ఇలాంటి ఆట‌గాళ్లు ఉంటారు. వారిలో మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ , రాహుల్ ద్ర‌విడ్ , కుమార సంగ‌క్క‌ర‌, ఎంఎస్ ధోనీ..ఇలా చెప్పుకుంటూ పోతే కొంద‌రే త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తారు.

ఇక ఉన్న‌ట్టుండి ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఒక ర‌కంగా ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ లో ఓ శ‌కం

ముగిసింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌త రెండేళ్ల నుంచి ఫామ్ లేమితో పాటు గాయాలు అత‌డిని బాధించాయి.

త‌న‌కు ఈసీబీ ప‌గ్గాలు అప్ప‌గించాక ఇంగ్లండ్ ను దుర్బేధ్య‌మైన జ‌ట్టుగా తీర్చిదిద్దాడు ఇయాన్ మోర్గాన్. అత‌డి సార‌థ్యంలో ఇంగ్లండ్

ఐదుసార్ల‌కు పైగా 400కు పైగా ర‌న్స్ సాధించింది.

2016లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఫైన‌ల్ కు చేర్చిన ఘ‌న‌త అత‌డిదే. కెరీర్ ప‌రంగా ఎన్నో రికార్డులు న‌మోదు చేసి ఉండ‌వ‌చ్చు. కానీ అత‌డి

నాయ‌క‌త్వం మాత్రం ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచే ఉంటుంది.

Also Read : సంజూ శాంస‌న్..హూడా అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!