Evin Lewis Dikok : ప్రపంచంలోనే ఇప్పుడు కోట్లు కురిపిస్తున్న ఏకైక క్రీడ ఏది అంటే అది బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్. ప్రతి ఏటా వేల కోట్లను కుమ్మరిస్తోంది.
ఇవాళ ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం టెండర్ పిలిస్తే ఏకంగా రూ. 50 వేల కోట్లు రావచ్చని ప్రాథమిక అంచనా. టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్న ఈ రిచ్ లీగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో.
ఎవరు హీరోలు అవుతారో ఇంకెవరు చరిత్ర సృష్టిస్తారో చెప్పడం కష్టం. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ రిచ్ లీగ్ లో ఇంకా బోణీ కొట్ట లేదు. ఐపీఎల్ సీజన్ లో ఈసారి అదనంగా రెండు జట్లు కొత్తవి చేరాయి.
వాటిలో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్ కాగా ఇంకోటి గుజరాత్ టైటాన్స్ . ఈ రెండు జట్ల నుంచే వేలం పాటలో ఏకంగా బీసీసీఐకి రూ. 1725 కోట్లు సమకూరాయి.
ఇక గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. లక్నో జెయింట్స్ ను మట్టి కరిపించింది. ఇక చెన్నైని కోల్ కతా నైట్ రైడర్స్ , లక్నో జెయింట్స్ ఓడించాయి.
తాజాగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన క్వింటన్ డికాక్(Evin Lewis Dikok) , లూయిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎవరి పట్లా కనికరం అంటూ చూపలేదు.
మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు వీరిద్దరూ. ఎవిన్ లూయిస్ (Evin Lewis Dikok)అయితే శివాలెత్తాడు. 23 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్స్ లతో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో లక్నో జెయింట్స్ బోణీ కొట్టింది ఐపీఎల్ లో.
Also Read : షమీ ప్రతాపం ముద్దుగుమ్మ ఆనందం