Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

ఆరెండు కాంటాక్ట్‌లకు చెందిన వారు రాజకీయాలకు సంబంధం లేదన్నారు...

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌(Jaipal Yadav)ను పోలీసులు విచారించారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట జైపాల్ యాదవ్ శనివారం ఉదయం విచారణకు హాజరయ్యారు. జైపాల్ యాదవ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుపతన్నకు తాను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లు ట్యాపింగ్(Phone Tapping) అయ్యాయని వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉండడంతో ఇద్దరి నంబర్స్ ఇచ్చినట్లు చెప్పారు.

Phone Tapping Case BRS MLA..

ఆరెండు కాంటాక్ట్‌లకు చెందిన వారు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ‘‘నాకు ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించాము. నేను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేసినట్లు పోలీసులు వివరణ కోరారు. వారు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారణ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. ఎప్పుడు విచారణకు పిలిచినా నేను సహకరిస్తాను. ఈ ఇష్యూ పొలిటికల్‌కు సంబంధం లేదు’’ అని జైపాల్ యాదవ్ స్పష్టం చేశారు.

ఫోన్ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కేవలం పోలీస్ ఆఫీసర్ల ప్రమేయానికి సంబంధించి విచారణ కొనసాగించారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల ప్రమేయానికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించిన తర్వాత బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు జారీ చేసి.. దాదాపు రెండు గంటల పాటు విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను విచారణకు హాజరుకావాలని చెప్పడంతో ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఐవోగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు భుజరంగరావు, రాధాకిషన్‌తో మాజీ ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఎన్నికల సమయంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు తనకు సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలు ఆరోపణలతో గతంలో లింగయ్యను విచారణ జరిపారు.

ఇప్పుడుఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో జైపాల్ యాదవ్ పాత్ర ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చబోతున్నారా.. సాక్షులుగా పెట్టబోతున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటి వరకు ఎస్‌ఐబీ పనిచేసిన అధికారులను, టాస్క్‌పోర్స్‌లో పనిచేసిన డీసీపీ రాధాకిషన్ రావును విచారణ జరిపి.. వారికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత అందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యూడిషిల్ రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల ప్రమేయానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. అప్పటి బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలకు కూడా ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులతో మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తుల నెంబర్‌ను అధికారులకు పంపించి వాళ్ల ఫోన్ ట్యాప్ చేయించారనే అభియోగాలు, ఆరోపణలతోనే మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు విచారిస్తున్నారు.

Also Read : Nara Rammurthy Naidu : చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి

Leave A Reply

Your Email Id will not be published!