Yeddyurappa : సీఎం జైలుకెళ్లడం ఖాయమంటున్న మాజీ సీఎం
ఉపఎన్నికల తర్వాత ఆయన జైలుకెల్లడం ఖాయమన్నారు...
Yeddyurappa : సీఎం సిద్దరామయ్య అక్రమాల గుట్టు రట్టయ్యిందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Yeddyurappa) జోస్యం చెప్పారు. శుక్రవారం సండూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తాలూకాలోని గొల్లలింగమ్మనహళ్లి, బొమ్మగట్ట, చోరనూరు, హె.కే హళ్లి, తదితర గ్రామాల్లో అభ్యర్థి బంగారు హనుమంత, గాలి జనార్దన్‌రెడి తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీ తి పెరిగిపోయిందని, సీఎం సిద్దరామయ్య ముడా కేసు, ఎస్టీ నిగమ మండలిలో రూ.189 కోట్లు దోచుకోవడం తదితర అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
Yeddyurappa Comments
ఉపఎన్నికల తర్వాత ఆయన జైలుకెల్లడం ఖాయమన్నారు. ఈడీ వద్ద అన్ని ఆధారాలున్నాయన్నారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రభుత్వ డబ్బులు, ఇతరులతో వసూలు చేసిన డబ్బుతో ఎన్నికలు జరుపుతున్నారన్నారు. జాతి, కులాల మధ్య వైర్యం పెంచుతున్నారని, నోటీసులు పేరుతో రైతులను బలి తీసుకుంటున్నారన్నారు. వక్ఫ్ భూముల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నా రన్నారు. రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలో రాష్ట్రం అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశం ప్రశాంతంగా ఉందని అలాగే అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
బీజేపీనాయకుడు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య తను చేసిన అభివృద్ధి పనులు చెప్పడం మానుకొని, తనపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి లోకాయుక్త విచారణలో చేయి కట్టుకుని నిలబడిన ఆయన తన గురించి మాట్లాడడం ఎంత వరకు నీతో చెప్పాలన్నారు. బీజేపీ అభ్యర్థి బంగారు హనుమంతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ గెలుపుతోనే సండూరు అభివృద్ధి సాధ్యమన్నారు. వీరితో పాటు తెలంగాణా బీజేపీ నాయకుడు సుధాకర్ రెడ్డి, సునీల్ కుమార్, రేణుకారాద్య , మాజీ మంత్రి శ్రీరాములు, దివాకర్, బైరతి బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : AP CID : మదనపల్లి ఫైళ్ల దహనం కేసు ఇన్వెస్టిగేషన్ లో దూకుడు పెంచిన సీఐడీ