Ex CM YS Jagan : ఏపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందని....

YS Jagan : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డ్ బద్దలు కొట్టిందని, 9 నెలల్లోనే రూ.80 వేల కోట్లు అప్పు తెచ్చిందని.. అమరావతి నిర్మాణం పేరుతో మరో రూ.52 వేల కోట్ల అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు.

YS Jagan Slams

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని జగన్(YS Jagan) విమర్శించారు. బటన్‌ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్‌ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు’ అంటూ ప్రచారం చేశారని, హామీలపై ఇంటింటికీ బాండ్లు కూడా ఇచ్చారన్నారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారని.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయని జగన్ నిలదీశారు.

గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారని ప్రస్తుతం చేసిన, చోయబోతున్న అప్పులు రూ.1.45 లక్షల కోట్లకుపైనే ఉన్నాయని జగన్ అన్నారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్‌ సిక్స్‌ ఇచ్చారా?.. అని ప్రశ్నించారు. పథకాలు ఏవీ అమలు కావడం లేదని, మరి రూ.1.45 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని, మద్యం షాపుల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగాలు పోయాయని జగన్ ఆరోపించారు.

Also Read : TG CLP Meeting : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీఎల్పీ మీటింగ్ కు ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!