Ex CM YS Jagan : నేడు గుంటూరు మిర్చి యార్డుకు రానున్న మాజీ సీఎం జగన్

అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు...

YS Jagan : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిర్చియార్డులో రైతులను జగన్(YS Jagan) పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం అంటూ మైకులో ప్రచారం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎన్సౌన్ మెంట్ చేశారు. అయితే జగన్(YS Jagan) పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనపై సందిగ్థత నెలకొంది.

YS Jagan will visit

కాగా మిర్చి ధర పతనంతో ఆవేదన చెందుతున్న రైతులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ గుంటూరుకు బుధవారం రానున్నారు. మిర్చియార్డులో రైతులను జగన్‌ పరామర్శిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం బృందావన్‌ గార్డెన్స్‌ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్చి యార్డుకు బుధవారం జగన్‌ వస్తారని రైతుల కష్ట, నష్టాలను తెలుసుకుంటారని, వారి ఆవేదనను వింటారని చెప్పారు. రైతులు తమ సమస్యలను జగన్‌కు వివరిస్తే తద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేస్తారన్నారు. మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు ఎన్నికల కోడ్ కి సంబంధం లేదని.. తాము పబ్లిక్ మీటింగులు పెట్టడం లేదని.. రైతుల సమస్యలు మాత్రమే వింటామని అంబటి అన్నారు. రైతులకు అండగా ఉంటాం అన్నారు..

మిర్చి రైతులను పరామర్శించేందుకు బుధవారం గుంటూరు రానున్న జగన్‌కు ఎన్నికల కమిషన్‌ అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని ఎన్నికల కమిషన్‌ తేల్చి చెప్పింది. అయితే జగన్‌ పర్యటన షెడ్యూలును వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మిర్చి యార్డుకు వస్తారని 12 గంటల వరకు యార్డులో రైతులతో చర్చించి తరువాత తిరిగి తాడేపల్లికి వెళతారు. కాగా ఎన్నికల కమిషన్‌ అనుమతి నిరాకరించడంతో జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

Also Read : UPSC Civils 2025 Update : యూపీఎస్సీ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించిన సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!