Satya Pal Malik Support : మహిళా రెజ్లర్లకు మాలిక్ మద్దతు
డబ్ల్యఎఫ్ఐ చీఫ్ ను సస్పెండ్ చేయాలి
Satya Pal Malik Support : భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ పై, ప్రధాని నరేంద్ర మోదీపై(PM Modi) నిప్పులు చెరుగుతున్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే దేశం తలదించు కుంటోందని పేర్కొన్నారు.
దేశం కోసం ఆడుతూ , జాతీయ పతాకపు గౌరవాన్ని తమ ప్రతిభతో ఇనుమడింప చేస్తున్న మహిళా రెజ్లర్ల ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik Support) . తమను లైంగింకంగా , మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ 9 మంది మహిళా రెజ్లర్లు రోడ్డుపైకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ, అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి ఠాకూర్ నిద్ర పోతున్నారా అంటూ నిప్పులు చెరిగారు మాజీ గవర్నర్.
ఇదిలా ఉండగా సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) గత కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. తాజాగా మాజీ గవర్నర్ తమకు మద్దతుగా నిలవడం, ప్రకటించడంపై ధన్యవాదాలు తెలిపారు ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ సైతం మద్ధతు తెలిపారు.
Also Read : మహిళలకు బస్సుల్లో ఫ్రీ – కాంగ్రెస్