Ex Minister Avanthi : వైసీపీకి బాయ్ బాయ్ చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు...
Ex Minister Avanthi : వైసీపీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. ఇప్పుడు ఆ వరుసలో మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఈ విషయంలో మరో బిగ్ అప్‌డేట్ సర్క్యూలేట్ అవుతుంది. వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. విశాఖపట్నంలో ముఖ్యనేత, మాజీ మంత్రిగానూ పని చేసిన ఆయన.. జగన్‌కు ఝలక్ ఇచ్చారు.. మరి ఎవరా నాయకుడు.. వైసీపీని వీడి ఎందులో చేరబోతున్నారు.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Ex Minister Avanthi Resign
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్(Ex Minister Avanthi) వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పని చేశారు. పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి భవిష్యత్ కనిపించని దృష్ట్యా ఆ పార్టీని వీడటమే తన పొలిటికల్ కెరీర్‌కు శ్రేయస్కరం అని అవంతి భావిస్తున్నారు. పైగా.. వైసీపీ అధిష్టానం కూడా అవంతికి సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని, జగన్ వ్యవహారశైలి, పార్టీ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు అవంతి. ఈ నేపథ్యంలోనే.. వైసీపీకి గుడ్ బై చెప్పడమే కరెక్ట్ అని.. ఇదే సరైన సమయం అని భావించి.. పార్టీకి రాజీనామా చేశారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్(Ex Minister Avanthi) ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అవంతి వైసీపీలో చేరారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో.. మంత్రిగా ఆయనకు అవకాశం లభించింది. రెండున్నరేళ్లు మంత్రిగా పని చేశారు. ఆ తరువాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన పదవి కోల్పోయారు. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే అవంతి శ్రీనివాస్ వైసీపీలో వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వైసీపీని వీడారు. అవంతి త్వరలోనే వేరే పార్టీలో చేరుతారని తెలుస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే సమాచారం బయటకు రాలేదు. అవంతి శ్రీనివాసే నేరుగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Also Read : Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు కొంత ఉరటనిచ్చిన ధర్మాసనం