Buggana Rajendranath Reddy : కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
Buggana Rajendranath Reddy : వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవస్థ విధ్వసం అయ్యిందని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Buggana Rajendranath Reddy) విమర్శించారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కంటే.. తమ ప్రభుత్వంలో వృద్ధి రేటు సాధించిందని గుర్తుచేశారు. ఈరోజు(ఆదివారం) వైసీపీ కార్యాలయంలో రాజేంద్రనాథ్‌రెడ్డి నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణంలో ఈరోజు పర్యటించారు. ఈ సంర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Buggana Rajendranath Reddy Comment
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారంలో రూ.14 లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందని అసత్య ఆరోపణలు చేశారని అన్నారు.. కానీ.. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి రూ.6 లక్షల కోట్లే రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రకటించాడు. రూ.9 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ఇందులో ఆర్థిక మంత్రి చెబుతుంది వస్తావామా… ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పింది వస్తావామా అని ప్రశ్నించారు. కావాలనే వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామన్నారని… కానీ.. అరకొరగా దీపం పథకం ఒక్కటి అమలు చేసి మూడు అమలు చేశామని చెబుతున్నారన్నారు. ఇలాంటి అబద్దాలు చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు. అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
Also Read : MLA Madhavi Reddy : కడప కార్పొరేషన్ ను వైసీపీ నాశనం చేసింది