Errabelli Dayakar : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
సీఎం సభకు ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే హాజరు కాలేదని....
Errabelli Dayakar : కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్లీ మొలకెత్తనివ్వబోమని హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar) ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బిడ్డా రేవంత్… బీఆర్ఎస్ చెట్టును ఎలా మొలవనివ్వవో మేము చూస్తాం’’ అని అన్నారు.
Errabelli Dayakar Rao Slams…
సీఎం సభకు ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే హాజరు కాలేదని.. దీంతోనే సీఎం అందరినీ కలుపుకుని పోవడం లేదని అర్థం అవుతోందన్నారు. ‘‘రేవంత్(CM Revanth Reddy) ఓ చీటర్, ఏ బ్రోకర్, ఓ కబ్జాకోరు. రేవంత్ ఒక గంజాయి మొక్క, కేసీఆర్ మర్రిచెట్టు. రేవంత్‌కు ఢీల్లీలో రాహుల్, సోనియా అపాయింట్ దొరకడం లేదు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్ పదవి ఊడగొడతారు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను రాక్షసుడు అన్నారు… అవును నేను రాక్షసుడ్నే. ప్రజల కోసం పనిచేసే రాక్షసుడిని. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నిన్ను సొంత నియోజకవర్గంలో తరిమితే బయటకు వచ్చావు’’ అంటూ దుయ్యబట్టారు.
మహిళలు కోటీశ్వరులు అవ్వడం కాదని…రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే కోటీశ్వరులు అవుతున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏం అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కాళోజీ కళాక్షేత్రం మేము నిర్మిస్తే… మీరు ఓపెన్ చేశారు’’ అని తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కళాక్షేత్రం నిర్మాణం ఆలస్యం అయిందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరని.. కాళోజీ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. ‘‘బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమంలో మేం తన్నులు తింటే… నువ్వు తప్పించుకున్నావ్. తెలుగుదేశం ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండా కాంగ్రెస్ కు వెళ్లింది రేవంత్ రెడ్డి ఒక్కరే’’ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు.
Also Read : MP Eatala Rajender : చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీజేపీ ఎంపీ ఈటల