Kakani Govardhan : ఎమ్మెల్యే సోమిరెడ్డి పై అసత్య ఆరోపణలు కేసులో విచారణకు మాజీ మంత్రి
ఈరోజుఉదయం 11 గంటల 45 నిమిషాలకు పోలీసు విచారణకు కాకాణి హాజరుకాగా....
Kakani Govardhan : ముత్తుకూరు పోలీస్‌స్టేష్‌న్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan) పోలీస్ విచారణ ముగిసింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, కార్టూన్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కాకణిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో పది రోజుల క్రితమే విచారణకు హాజరుకావాలని మాజీమంత్రికి కృష్ణపట్నం సర్కిల్ పోలీసులు నోటీసులిచ్చారు. దీంతో ఈరోజు (బుధవారం) ఉదయం ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌కు కాకాణి గోవర్ధన్ విచారణకు హాజరయ్యారు. కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్ సమక్షంలో మాజీ మంత్రి విచారణకు హాజరయ్యారు.
Kakani Govardhan Case…
ఈరోజుఉదయం 11 గంటల 45 నిమిషాలకు పోలీసు విచారణకు కాకాణి హాజరుకాగా.. దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. కృష్ణపట్నం సర్కిల్ సీఐ, రవి నాయక్ ముత్తుకూరు ఎస్సై విశ్వనాథ్ రెడ్డి మరో ఇద్దరు పోలీస్ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు. విచారణలో దాదాపు 54 ప్రశ్నలను మాజీ మంత్రి కాకాణిని పోలీసులు అడిగారు. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి మరి కొన్ని ప్రశ్నలకు కాకణి సరైన సమాధానం చెప్పనట్టు తెలుస్తోంది. అయితే పోలీసు విచారణకు సందర్భంగా పెద్ద సంఖ్యలో తన కార్యకర్తలతో కలిసి కాకాణి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు కాకాణి ఒక్కరినే పోలీసులు స్టేషన్‌లోకి అనుమతించారు.
కాగా..కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి తానే స్వయంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో కాకాణి అసత్య, అసభ్యకర పోస్టింగ్‌లపై తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేయడంతో పాటు.. విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందజేశారు.
Also Read : KTR : మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ కేటీఆర్