Narayana Arrest : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
ఏపీ సీఐడీ అదుపులో భార్య సైతం
Narayana Arrest : ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు నారాయణను(Narayana Arrest) అరెస్ట్ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని నోకియా సమీపంలో వెళుతుండగా నారాయణ, ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరుకు ఆయన కారులోనే తరలిస్తున్నట్లు సమాచారం. ఆయన బెంజ్ కారును వాడుతున్నారు.
నారాయణ సంస్థల సిబ్బంది సైతం పెద్ద ఎత్తున ఆయనను అదుపులోకి తీసుకోవడాన్ని అభ్యంతరం తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమైన నాటి నుంచి లీకులు అయ్యాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ లీకేజీల వ్యవహారంలో నారాయణ(Narayana Arrest) విద్యా సంస్థల పాత్ర కూడా ఉందని విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల చైర్మన్ గా కూడా నారాయణ కొనసాగుతున్నారు.
ప్రస్తుతం ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంపై ఆరా తీస్తున్నారు. ఏపీ రాజధాని అసైన్డ్ భూముల కేసుల విషయంలోనూ గతంలో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఆయన టీడపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా ఉన్నారు. గతంలో నెల్లూరు లోని నారాయణ నివాసంలోనూ సీఐడీ సోదాలు చేపట్టింది. నారాయణపై(Narayana Arrest) చిత్తూరు డిఇఓ ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తుగా ప్రశ్నా పత్రాలను నారాయణ సంస్థల ప్రిన్సిపాల్ ప్రమేయం ఉన్నట్లు ఇందులో పేర్కొన్నారు. ప్రశ్నా పత్రాల వివరాలను వాట్సాప్ ద్వారా షేర్ చేశారని ఫిర్యాదులో తెలిపారు.
తమ సంస్థల పిల్లలకు ర్యాంకులు రావాలని ఇలా ఫ్రాడ్ కు పాల్పడ్డారని ఆరోపించారు.
Also Read : టీఎస్ఎస్పీడీసీఎల్ లో పోస్టుల భర్తీకి ఓకే