EX Minister Srinivas Goud : మాకు ఎవరితో పొత్తు లేదు…రేవంత్ సర్కార్ నిజాలు మాట్లాడితే మంచిది
కాళేశ్వరం పరిశీలించిన తర్వాత మీరు ... పరమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను పరిశీలించాలన్నారు
EX Minister Srinivas Goud : సీఎంగా రేవంత్‌రెడ్డి నిజాలు మాట్లాడితే మంచిదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(EX Minister Srinivas Goud) అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో వలసలు నిలిచిపోయాయని అన్నారు. గతంలో ముంబైకి బస్సులు వెయ్యాలని ధర్నాలు చేసేవారని ఇప్పుడు అవి ఎం లేవని అన్నారు. పాలమూరు అభివృద్ధి గురించి మాట్లాడటం మంచిదన్నారు. అభివృద్ధి జరగలేదని అనడం సరికాదన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కార్యక్రమం కింద నీళ్లు ఇవ్వలేదా ఆత్మసాక్షిగా మాట్లాడాలి అని ప్రశ్నించారు. ఒక్కసారి ఓడిన కెసిఆర్ పై అంట అహంకారమ. కేసీఆర్ పాలమూరు ఎంపీ కావడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. తెలంగాణ అంశాన్ని దాచేందుకే శిలాఫలకాలు ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ సీఎం అయ్యారని అన్నారు. రాష్ట్రానికి సీఎంగా నియమితులైనందున రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
EX Minister Srinivas Goud Commennts on CM
కాళేశ్వరం పరిశీలించిన తర్వాత మీరు … పరమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను పరిశీలించాలన్నారు. కొడంగల్ ఎత్తుపల్లాలపై పునరాలోచన చేయాలని సూచించారు. జూరాల నుంచి నీటి రవాణా సాధ్యమేనా అని ఆలోచించాలన్నారు. కర్ణాటక కొత్త నీటిపారుదల పథకాన్ని ప్రారంభిస్తే జూరాల నుంచి నీటి వసతి ఉండదన్నారు. 15శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నాలుగైదు నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయవచ్చన్నారు. దీనిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల భవిష్యత్తుపై పునరాలోచించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముసలి పండుగ అవుతుందని హెచ్చరించారు. “మేము చాలా చేసినప్పటికీ, ప్రజలు మరింత కోరుకున్నారు.” అందుకే మీకు అవకాశం వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జాతీయ నాయకత్వంతో పొత్తు ఉంటుందా.. మేము కూడా అలానే చెప్పుతో కొడతాం అనవచ్చు. రెండు జాతీయ పార్టీలకు పొత్తు అవసరం. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కలిసి పాలమూరుపై పోటీ చేయలేదా”. మాకు పొత్తు అవసరం లేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Also Read : EX Minister KTR : తెలుగు బిడ్డ జాహ్నవి కేసులో నిందితులను శిక్షించాలి