Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి లుక్ అవుట్ నోటీసులు..?
కాగా గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు...
Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి లుక్ ఔట్ నోటీసులపై ఏపీ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ చెప్పారు. వంశీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఆయన ఆచూకీ కనుగొనేందుకు విశాఖపట్నం, హైదరాబాద్, బళ్లారి, బెంగళూరుకు పోలీస్ బృందాలు వెళ్లాయన్నారు. వంశీ దగ్గర బంధువులు, స్నేహితులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారన్నారు. కాగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఇప్పటికే 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వంశీ స్వదేశంలో ఉన్నారా? లేదా విదేశాల్లో ఉన్నారా? అన్నదానిపై పోలీసు వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Vallabhaneni Vamsi Case
కాగా గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వంశీని(Vallabhaneni Vamsi) ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వంశీ కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు వల్లభనేని వంశీ హైదరాబాద్‌లో లేరని, అమెరికా వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆయన కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించారు. కాగా గత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read : Vizag Railway Station : వైజాగ్ రైల్వే స్టేషన్ కోర్బా ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం