Ex MP Gorantla Madhav : మరికొన్ని కొత్త చిక్కుల్లో పడ్డ వైసీపీ మాజీ ఎంపీ

గోరంట్ల మాధవ్ గతేడాది చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి...

Gorantla Madhav : అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Gorantla Madhav) నోటీసులు అందుకున్నారు. విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ నోటీసులు అందుకున్న గోరంట్ల.. ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన సీరియస్ అయ్యాయి. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. మాధవ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ జగదీష్‌కు ఆ రెండు పార్టీలు కంప్లయింట్ చేశాయి. రాష్ట్రంలో అలజడులు సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో తెలిపాయి టీడీపీ, జనసేన. అంతేగాక గోరంట్లపై రాజద్రోహం కేసు వేయాలని డిమాండ్ చేశాయి.

Gorantla Madhav Issues

గోరంట్ల మాధవ్ గతేడాది చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. 2024, అక్టోబర్ 21న అనంతపురంలోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఏరియాల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధితుల పేర్లను ఆయన బహిర్గతం చేశారు. దీంతో అదే ఏడాది నవంబరు 2న విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. సెక్షన్ 23 (4) ఆఫ్ పోక్సో, బీఎన్‌ఎస్‌ఎస్ 72, 79 సెక్షన్ల కింద గోరంట్ల మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో సైబర్‌క్రైమ్ పోలీసులు ఆయన్ను విచారించనున్నారు.

Also Read : North Korea : మరో కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తున్న ఉత్తర కొరియా

Leave A Reply

Your Email Id will not be published!