IPL 2023 Mini Auction : ఐపీఎల్ మినీ వేలంపై ఉత్కంఠ
రేసులో మొత్తం 991 ఆటగాళ్లు
IPL 2023 Mini Auction : వచ్చే ఏడాది 2023లో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐపీఎల్ మినీ వేలం(IPL 2023 Mini Auction) నిర్వహించనుంది. ఇందుకు వేదికను కూడా ఖరారు చేసింది. ఈసారి ఐపీఎల్ కు సంబంధించి వేలం పాట బెంగళూరు వేదికగా జరిగింది.
కానీ ఈసారి ఆ వేదికను కేరళలోని కొచ్చికి మార్చింది. అయితే ఆయా ఫ్రాంచైజీలు తేదీని మార్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు విన్నవించాయి. ఎందుకంటే క్రిస్మస్ ఉంటుందని, చాలా ఫ్రాంచైజీలలో ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాయి.
ఇది పక్కన పెడితే మినీ వేలంలో 991 మంది ఆటగాళ్లు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈసారి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి అత్యధికంగా 50 మందికి పైగా ప్లేయర్లు ఉండడం విశేషం. ఎంత మందికి అత్యధిక ధర పొందుతారనేది ఖరారు కానుంది. బీసీసీఐ ఈ వేలం కోసం భారత దేశానికి చెందిన ఆటగాళ్లతో పాటు అన్ని దేశాలకు చెందిన 1,000 మంది ప్లేయర్లు నమోదు చేసుకున్నారు.
ఇందులో 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. నవంబర్ 15 నాటికి మొత్తం 10 ఫ్రాంచేజీలు రిటైన్ , రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. కొన్ని జట్లు భారీగా ఆటగాళ్లను వదులుకున్నాయి.
మరికొన్ని జట్లు కొంత మంది ప్లేయర్లను మాత్రమే విడుదల చేశాయి. వీరిలో 991 మంది ఆటగాళ్లలో మొత్తం 714 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా వీరిలో 19 మంది ప్లేయర్లు క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక విదేశీ ఆటగాళ్లలో 166 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.
Also Read : బంగ్లాదేశ్ భారత్ బిగ్ ఫైట్