Pramod Sawant Rane : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల పర్వం ముగిసింది. నువ్వా నేనా అన్న రీతిలో గోవాలో ఎన్నికలు జరిగాయి. మరోసారి బీజేపీ గోవాతో పాటు మణిపూర్ , ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.
ఇప్పటికే రాజ్యాంగబద్దంగా ముందస్తు రాజీనామాలు సమర్పించారు.
తాజాగా గోవాలో ఏర్పాటు కాబోయే భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వానికి ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే సీఎం పదవిపై ఎలాంటి అధికార పోరు లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నాలుగు రాష్ట్రాల సీఎం ల కోసం బీజేపీ హైకమాండ్ ఇప్పటికే భేటీ అయ్యింది.
ఉత్తరాఖండ్ లో ధామీ , మణిపూర్ లో సింగ్ , యూపీలో యోగి ఇప్పటికే ఖరారు కాగా గోవా విషయంలోనే సందిగ్దం నెలకొంది.
అన్ని రాష్ట్రాల పార్టీలతో సమన్వయం చేసే పనిలో పడింది బీజేపీ.
తదుపరి సీఎంపైనే ఇంకా పార్టీలో అనిశ్చితి కొనసాగుతుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది గోవా బీజేపీని.
ఇదిలా ఉండగా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై మంగళవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని పిలిచారు.
ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.
వరుసగా ఆ పార్టీ మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. ఎంజీపీతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్ధతు కూడా ఉంది ఆ పార్టీకి.
బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర పరిశీలకులు బీఎల్ సంతోష్ , పీయూష్ గోయల్ సీఎం ఎవరనే దానిని నిర్ణయించేందుకు గోవాకు చేరుకున్నారు. మొత్తం 40 స్థానాలు ఉండగా 20 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
రాజ్ భవన్ లో ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ (Pramod Sawant Rane)గవర్నర్ శ్రీధరన్ పిళ్లైతో సమావేశమై రాజీనామా సమర్పించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్దమై ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అనూహ్యంగా బీజేపీకి చెందిన విశ్వ జిత్ రాణే కూడా గవర్నర్ ను కలిశారు. దీంతో ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే