Team India 3rd Test : తుది జట్టు ఎంపికపై ఉత్కంఠ
మూడో టెస్టులో ఊడేది ఎవరో
Team India 3rd Test : భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కెప్టెన్ కమిన్స్ తన తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశం వెళ్లి పోయాడు. అతడి స్థానంలో స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఇక నాలుగు టెస్టుల సీరీస్ లో ఇప్పటికే భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక టీమిండియా విషయానికి వస్తే టాప్ ఆర్డర్ సరిగా ఆడక పోవడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ పూర్ పర్ ఫార్మెన్స్ తీవ్ర అడ్డంకిగా మారింది.
మరో వైపు మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలెక్షన్ తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తుది జట్టులో(Team India 3rd Test) ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేఏల్ రాహుల్ ను ఫైనల్ చేయక పోవచ్చని టాక్. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫ్యాన్స్ సైతం బీసీసీఐపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉండగా కేఎల్ రాహుల్ ను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. అతడి స్థానంలో శుభ్ మన్ గిల్ , సూర్య కుమార్ యాదవ్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. తుది జట్టు అంచనా ఇలా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ కాగా , కేఎల్ రాహుల్ , శుభ్ మన్ గిల్ , ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ , ఇషాన్ కిషన్ , ఆర్ అశ్విన్ , అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , రవీంద్ర జడేజా, సిరాజ్, షమీ, అయ్యర్ , సూర్య , ఉమేష్ , జయదేవ్ ఉనాద్కత్ ఉండే ఛాన్స్ ఉంది.
Also Read : మూడో టెస్టులో కేఎల్ రాహుల్ కష్టమే