#OTT : థియేట‌ర్ల కంటే ఓటీటీ నే బెట‌ర్

రాబోయే రోజుల్లో థియేట‌ర్లుండ‌వు

OTT : ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండ‌దు. ఎంచ‌క్కా చూస్తూ..ఆస్వాదిస్తూ..కోరుకున్న‌ది మ‌న చెంత‌కు వ‌చ్చేలా చేస్తోంది ఓవ‌ర్ ద టాప్ అంటే ఓటీటీ అన్న మాట‌. ప్ర‌స్తుతం టెక్నాల‌జీ లో చోటు చేసుకుంటున్న నూత‌న పోక‌డ‌లు ఇదే రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన కంపెనీలు, సంస్థ‌లు, వ్యాపార‌వేత్త‌ల‌కు వ‌ద్దంటే కాసులు కురిపిస్తున్నాయి.

ప్ర‌పంచంలో ఏ రంగ‌మైనా స‌రే లాభ పడాల‌న్నా, నిల‌దొక్కు కోవాల‌న్నా కావాల్సింది ముందు వినియోగ‌దారులు. సినిమాకైతే ప్రేక్ష‌కులే దేవుళ్లు. వాళ్లు లేక పోతే వీరికి గ‌డ‌వ‌దు.అందుకే ప్ర‌తి సంస్థా క‌స్ట‌మ‌ర్లే మాకు ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అంటున్నాయి. ఒక‌ప్పుడు ఇంటింటా తిరుగుతూ బట్ట‌లు ఉతేందుకు పౌడ‌ర్ ను అమ్మిన ఓ వ్య‌క్తి ఏకంగా కోట్ల కంపెనీకి ఓన‌ర్ అయ్యాడు. వేలాది మందికి ఉపాధి క‌ల్పించాడు

అదే వాషింగ్ పౌడ‌ర్ నిర్మా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వినోద రంగం ఇపుడు థియేట‌ర్ల కంటే స్మార్ట్ ఫోన్ల‌లో ద‌ర్శ‌న‌మిస్తోంది. దీంతో లెక్క‌కు మించి కంపెనీలు రోజుకు ఒక‌టి పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్ క‌నెక్టివిటీ పెరిగాక ప్ర‌పంచం ద‌గ్గ‌రైంది..చిన్న‌దై పోయింది. దేశ వ్యాప్తంగా ఇపుడు ఓటీటీల‌దే హ‌వా. ప్ర‌తి కంపెనీ ఈ రంగం మీద పెట్టుబ‌డి పెట్టేందుకు రెడీ అంటోంది.

ఎందుకంటే కూర్చున్న చోట ఒక్క‌సారి పెట్టుబ‌డి పెడితే త‌రాల త‌ర‌బడి ఆదాయం అందుకునే మార్గం ఇది. వినోద రంగం ఓటీటీని జ‌పిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలు ఇలా ప్ర‌తి ఒక్క ప్రోగ్రాం ఇందులోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ వేదిక తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.

30 కి పైగా ఇండియాలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు ఉన్నాయి. ఏకంగా 4 వేల 500 కోట్ల‌కు ఆదాయం చేరుకుంద‌ని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ఓటీటీల్లో 35 కోట్ల మంది వీటితో క‌నెక్ట్ అయి ఉండ‌డం విశేషం.

వీక్షకుల సంఖ్య 35.50కోట్లకు.. వార్షిక టర్నోవర్‌ రూ.4,500 కోట్లకు చేరిక

ఈవై ఫిక్కీ ఇండియన్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌)… వినోద రంగం జపిస్తున్న మంత్రమిది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టాక్‌ షోలు.. ఇలా అన్నింటికీ ప్రస్తుతం అనువైన వేదిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లే. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం అరచేతిలోకి తీసుకువచ్చిన ఈ వేదిక ప్రస్తుతం వినోద రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దేశంలో 30కు పైగా ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయం ఏకంగా రూ.4,500 కోట్లకు చేరడం విశేషమని ఈవై ఫిక్కి ఇండియన్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ తాజా నివేదిక పేర్కొంది. దేశంలో మారుమూల పల్లెల వరకూ విస్తరించిన ఇంటర్నెట్‌ సౌకర్యం.. స్మార్ట్‌ఫోన్ల విప్లవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎంతగానో కలిసివచ్చింది. కరోనా వల్ల ప్రజలు జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించడం కూడా అందుకు మరో కారణం. ఈ నేపథ్యంలో దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ అమాంతంగా పెరుగుతోంది.

తాజా నివేదికలోని ప్రధాన అంశాలివీ..
► దేశంలో 30కు పైగా ఉన్న ఓటీటీల ఆదాయం 2020 చివరి నాటికి ఏకంగా రూ.5 వేల కోట్లకు చేరుకుంది. 2017లో రూ.2,019 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.4,500 కోట్లకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 నాటికి రూ.5,560 కోట్లకు చేరుతుందని అంచనా.
► ఓటీటీల ఆదాయంలో ‘డిమాండ్‌ ఆన్‌ వీడియో (ఎస్‌వీఓడీ)ల ద్వారానే 70 శాతం వస్తోంది.
► దేశంలో 2020 నాటికి ఇంటర్నెట్‌ వాడుతున్న వారి సంఖ్య దాదాపు 55 కోట్లకు చేరింది.
► 2017లో 25 కోట్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు 2020 డిసెంబర్‌ నాటికి 50 కోట్లకు చేరుకున్నారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వీక్షకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2020 డిసెంబర్‌ నాటికి దేశంలో ఓటీటీ వేదికల వీక్షకుల సంఖ్య 35.50 కోట్లకు చేరింది.
► 2019తో పోలిస్తే 2020లో ఓటీటీ వీక్షకులు 35 శాతం పెరిగారు. వీరిలో 60శాతం మంది 18 ఏళ్ల నుండి 35 ఏళ్లలోపు వారే ఉన్నారు.
► ఓటీటీలలో 40 శాతం ప్రాంతీయ భాషల కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. దేశంలో ఓటీటీ వేదికల ద్వారా ఇంగ్లిష్‌ కార్యక్రమాల వీక్షకులు కంటే హిందీ, ఇతర ప్రాంతీయ భాషల కార్యక్రమాల వీక్షకులు రెండున్నర రెట్లు అధికంగా ఉన్నారు.

No comment allowed please