Faf Du Plessis Kohli : రాణించిన డుప్లెసిస్..విరాట్ కోహ్లీ
లక్నో సూపర్ జెయింట్స్ తో 62 రన్స్ భాగస్వామ్యం
Faf Du Plessis Kohli : లక్నో వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అసాధారణ ఆట తీరుతో ఆకట్టుకుంది. ఇదే వేదికపై పరుగుల వరద పారింది. కానీ ఈసారి అందుకు భిన్నంగా పిచ్ సహకరించ లేదు. దీనికి తోడు వరుణుడు కూడా అడ్డంకిగా మారడంతో బౌలర్లు పండుగ చేసుకున్నారు. అద్భుతమైన షాట్స్ తో అలరిస్తూ వచ్చిన బ్యాటర్లు తేలి పోయారు. బౌలర్ల దెబ్బకు విల విల లాడారు. చివరకు బంతుల్ని ఆడ లేక డిఫెన్స్ కోసం ప్రయత్నించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 15 ఓవర్లు ముగిసే సరికి వర్షం మొదలైంది. ఆట నిలిచి పోయింది. ఆ తర్వాత వరుణుడు కరుణించడంతో తిరిగి ఆట ప్రారంభమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 126 పరుగులకే పరిమితమైంది.
ఓ వైపు లక్నో బౌలర్ల దెబ్బకు బెంగళూరు బ్యాటర్లు క్యూ కడితే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు(Faf Du Plessis Kohli) తట్టుకుని నిలబడ్డారు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి 62 విలువైన రన్స్ చేశారు. దీంతో ఆ మాత్రం స్కోర్ చేసింది ఆర్సీబీ. డుప్లెసిస్ 40 బంతులు ఆడి ఒక ఫోర్ ఒక సిక్సర్ తో 40 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ 30 బంతులు ఆడి 31 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరు తప్ప ఇంకే బ్యాటర్ రాణించ లేదు ఆర్సీబీలో.
Also Read : విరాట్ కోహ్లీ హల్ చల్