PM Modi : సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలం
గ్లోబల్ గవర్నెన్స్ పై మోదీ ఆగ్రహం
PM Modi G20 : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుళపాక్షిక సంస్థలు విఫలం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ గవర్నెన్స్ పై నిప్పులు చెరిగారు నరేంద్ర మోదీ(PM Modi G20). బహుళ పాక్షికత సంక్షోభంలో ఉందన్నారు.
తాము లోతైన ప్రపంచ విభజనల సమయంలో కలుస్తున్నామని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల అనుభవం, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి , ఉగ్రవాదం, యుద్దాలను ఎదుర్కోవడంలో, వాటిని నియంత్రించడంలో ప్రపంచ పాలన ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు నరేంద్ర మోదీ. ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
సంవత్సరాల పురోగతి తర్వాత ఇవాళ మనం సుస్థిర అభివృద్ది లక్ష్యాలను తిరిగి పొందే ప్రమాదంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. అనేక అభివృద్ది చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధన భద్రతను నిర్ధారించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు భరించ లేని అప్పులతో పోరాడుతున్నాయని అన్నారు.
ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు నరేంద్ర మోదీ. అందుకే భారత దేశం జి20 ప్రెసిడెన్సీ ప్రపంచ దక్షిణాదికి వాయిస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి(PM Modi G20). ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలకు , ఎదురవుతున్న సవాళ్లకు ఎవరు కారణమో మీరంతా గమనించాలని అన్నారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించ గలిగితే ఇలాంటివి ఎదురు కావన్నారు మోదీ.
Also Read : ఎరిక్ గార్సెట్టికి వైట్ హౌస్ మద్దతు