MTV Awards 2022 : ఘనంగా ఎంటీవీ అవార్డుల ఉత్సవం
స్కార్లెట్ జాన్సన్ ఉత్తమ హీరోగా ఎంపిక
MTV Awards 2022 : నో వే హోమ్ స్టార్స్ జెండయా , టామ్ హాలండ్ అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ఎంటీవీ 2022 అవార్డులు (MTV Awards 2022) అందుకున్నారు. సూపర్ హీరో చిత్రానికి గాను టామ్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ పురస్కారం అందుకున్నారు.
జెండయా తన షో యుఫోరియా కోసం ఉత్తమ ప్రదర్శన అవార్డు తీసుకుంది. ఇక బ్లాక్ విడో చిత్రానికి గాను స్కార్లెట్ జాన్సన్ ఉత్తమ అవార్డు పొందారు.
ది లాస్ట్ సిటీలో తన నటనకు గాను హ్యారీ ఫోటర్ స్టార్ డేనియల్ రాడ్ క్లిఫ్ ఉత్తమ విలన్ అవార్డు గెలుచుకున్నారు. ర్యాన్ రేనాల్డ్స్ ఫ్రీ గై చిత్రంలో ఉత్తమ హాస్య ప్రదర్శనకు అవార్డు దక్కించుకున్నారు. ఈ మెగా ఈవెంట్ ను వెనెస్సా హడ్జెన్స్ హోస్ట్ చేశారు.
ఉత్తమ చిత్రంగా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ గా ఎంపికైంది.
ఉత్తమ ప్రదర్శనగా యుఫోరియా నిలిచింది. ఉత్తమ ప్రదర్శన కింద టామ్ హాలండ్ , స్పైడర్ మాన్ నో వే హోమ్ ఎంపికైంది. ఉత్తమ హీరోగా
స్కార్లెట్ జాన్సన్ బ్లాక్ విడో కోసం ఎంపికయ్యాడు.బెస్ట్ కిస్ కింద పూపీస్ ది స్నేక్ – జాకస్ ఫరెవర్ నిలిచింది. పురోగతి ప్రదర్శన కింద సోఫియా డి మార్టినో , బెస్ట్ ఫైట్ అవార్డు కాస్సీ
వర్సెస్ మ్యాడీ, యుఫోరియా మూవీ నుంచి. అత్యంత భయపెట్టిన ప్రదర్శన జెన్నా ఒర్టెగా, స్క్రీమ్ , ఉత్తమ జట్టు కింద లోకి, టామ్ హిడిల్ స్టన్ ,
సోఫియా డి మార్టినో, ఓవెన్ విల్సన్ నిలిచారు.
హుక్ అప్ కింద యుఫోరియా కు దక్కింది. బెస్ట్ సాంగ్ అవార్డు ఆన్ మై వే (మేరి మి) , జెన్ని ఫర్ లోపెజ్ కు దక్కింది. ఉత్తమ డాక్యుమెంట్ అవార్డు రియాలిటీ సీరీస్ , ఉత్తమ పోటీ సీరీస్ – రూపాల్స్ డ్రాగ్ రేస్ .
ఉత్తమ(MTV Awards) జవన శైలి ప్రదర్శన కింద సెలీనా , చెఫ్, ఉత్తమ కొత్త అన్ స్క్రిప్డ్ సిరీస్ కింద ది డి అమెలియో షో, ఉత్తమ రియాలిటీ స్టార్ కింద
క్రిషెల్ స్టౌజ్ ఎంపికయ్యారు.
వినోదం హాలీవుడ్ కు సంబంధించి బెస్ట్ రియాలిటీ రొమాన్స్ కింద లోరెన్, అలెకస్ఈ బ్రోవర్నిక్ , లోరెన్ అండ్ అలెక్సీ – ఆఫ్టర్ ది 90 డేస్ .
బెస్ట్ టాక్ , టాపికల్ షో జిమ్మీ ఫాలన్ నటించిన ది టునైట్ షో . ఉత్తమ హోస్ట్ గా కెల్లీ క్లార్కన్ ఎంపికయ్యారు.బ్రేక్ త్రూ సోషల్ స్టార్ అవార్డు(MTV Awards) బెల్లా పోర్చ్ ఎంపికయ్యారు. బెస్ట్ ఫైట్ కింద బోస్కో వర్సెస్ లేడీ కామ్డెన్ , బెస్ట్ రియాలిటీ రిటర్న్
కింద పారిస్ హిల్టన్ , కుకింగ్ విత్ ప్యారిస్ అండ్ ప్యారిస్ ఇన్ లవ్. ఉత్తమ సంగీత డాక్యుమెంటరీగా ఒలివియా రోడ్రిగో నిలిచింది.
జనరేషన్ అవార్డు జెన్నిఫర్ లోపెజ్ గెలుపొందింది. కామెడిక్ జీనియస్ అవార్డు జాక్ బ్లాక్ కు దక్కింది. రియాలిటీ రాయల్టీ బెథెన్సీ ఫ్రాంకెల్ ను వరించింది.
Also Read : సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ