BCCI Selection Committee : బీసీసీఐ సెలెక్ట‌ర్ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

శిఖ‌ర్ ధావ‌న్ ప‌క్క‌న పెట్ట‌డంపై ఫైర్

BCCI Selection Committee : శిఖ‌ర్ ధావ‌న్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. బెస్ట్ ఓపెన‌ర్ గా కూడా పేరొందాడు. అంతే కాదు ప్ర‌తి ఐపీఎల్ లో మినిమం ర‌న్స్ చేస్తూ త‌న స‌త్తా చాటుతూ వ‌చ్చాడు.

తాజాగా ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022 లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. భారీగా ప‌రుగులు చేశాడు. తాజాగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ(BCCI Selection Committee) స్వ‌దేశంలో ప‌ర్య‌టించే సౌతాఫ్రికా టూర్ కు 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ తో పాటు ఇంగ్లండ్ తో జ‌రిగే ఏకైక టెస్టుకు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది.

ప‌లువురు ఆట‌గాళ్ల‌ను విస్మ‌రించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధానంగా శిఖ‌ర్ ధావ‌న్ ను ఎందుకు ఎంపిక చేయ‌లేదంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి.

ఎలాంటి ప‌ర్ ఫార్మెన్స్ లేకున్నా వెంక‌టేశ్ అయ్య‌ర్ ను ఎందుకు ఎంపిక చేశారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై వివ‌ర‌ణ కూడా ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది బీసీసీఐ.

ఎవ‌రైనా ఫామ్ లో ఉన్న వారిని ఎంపిక చేస్తారు. కానీ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శిస్తున్న ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌డం భార‌త సెలెక్ట‌ర్ల‌కు సాధ్య‌మైందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా టీ20 జ‌ట్టు ఎంపిక(BCCI Selection Committee) పూర్తిగా కేఎల్ రాహుల్ మీదే ఆధార‌ప‌డి ఎంపిక చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పూర్తిగా యువ‌కుల‌తో కూడిన జ‌ట్టు కావాల‌ని, వెట‌ర‌న్ ఆట‌గాళ్లు వ‌ద్ద‌న్నందుకే ధావ‌న్ ను ఎంపిక చేయ‌లేద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ద్వారా శిఖ‌ర్ ధావ‌న్ కు చెప్పించార‌నేది టాక్.

Also Read : అబ్బా సూప‌ర్ నోవాస్ దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!