Sanju Samson : సంజూకు అన్యాయం సర్వత్రా ఆగ్రహం
రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యర్ కు ఛాన్స్
Sanju Samson : మరోసారి కేరళ స్టార్ సంజూ శాంసన్ కు అన్యాయం జరిగింది. ఇవాళ న్యూజిలాండ్ తో జరిగిన టి20 రెండో మ్యాచ్ లో సంజూ శాంసన్ కు బదులు శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆపై ఓపెనర్ గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ మరోసారి నిరాశ పరిచాడు. 13 బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు చేశాడు.
ఇక సంజూ శాంసన్ కు బదులుగా తీసుకున్న అయ్యర్ 13 పరుగులకే చాప చుట్టేశాడు. ఇషాన్ కిషన్ పర్వాలేదని అనిపిస్తే సూర్య కుమార్ దంచి కొట్టడంతో భారీ స్కోర్ చేసింది. ఇది పక్కన పెడితే సంజూ శాంసన్ ను ఎందుకు ఎంపిక చేయలేదంటూ మాజీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
శ్రేయస్ అయ్యర్ కంటే సంజూ శాంసన్(Sanju Samson) ఎందులో తక్కువో చెప్పాలంటూ బీసీసీఐని, తాత్కాలిక కోచ్ లక్ష్మణ్ ను నిలదీశారు. అయ్యర్ శాంసన్ కంటే ముందున్నారా..అయ్యో ఎంత జోక్ అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. రెండో టీ20 జట్టు ఎంపికపై భగ్గుమన్నారు. పూర్తిగా పాలిటిక్స్ చోటు చేసుకున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లో ఛాన్స్ కోల్పోయాడు శాంసన్. చివరకు న్యూజిలాండ్ టూర్ కు ఎంపిక చేయడంతో ఆడిస్తారని అనుకున్నారు. కానీ పాండ్యా, లక్ష్మణ్ రాజకీయాల వల్ల శాంసన్ కు చోటు దక్కలేదని వాపోయారు. ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని , ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read : సంజూ శాంసన్‌కు ఛాన్స్ దక్కుతుందా