Puneeth Rajkumar : కన్నడ నాట దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అలియాస్ అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే అప్పూ జయంతి ఇవాళ. 46 ఏళ్లకే ఈ లోకం నుంచి నిష్క్రమించాడు ఈ అరుదైన నటుడు.
తన తండ్ర కన్నడ కంఠీరవగా పేరొందినా పునీత్ రాజ్ కుమార్ తనంతకు తానుగా నటుడిగా ఎదిగాడు. దేశ వ్యాప్తంగా లెక్కలేనంత అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
నటుడిగా పేరు తెచ్చుకున్నా సామాజిక సేవా కార్యక్రమాలతో మరింత పేరు పేరొందారు పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar). ఎందరో విద్యార్థులకు అండగా నిలిచాడు.
పేదలను ఆదుకున్నాడు. వృద్దులకు భరోసా కల్పించాడు. అనాధ శరణాలయాలకు గుప్త దానాలు అందించాడు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా వెంటనే స్పందించే మనస్తత్వం కలిగి ఉన్నాడు పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar).
ఇంట్లో జిమ్ లో ఉన్న సమయంలో ఆయన గుండె పోటుకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లే లోపే కన్ను మూశారు. లక్షలాది మంది అప్పూ మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కర్ణాటకకు చెందిన ప్రముఖ విశ్వ విద్యాలయం మైసూర్ యూనివర్శిటీ పునీత్ రాజ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
తాజాగా అప్పూ 47వ జయంతిని పురస్కరించుకుని కన్నడ నాట ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు. పండ్లు, అన్నదానం చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
అప్పూ నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ ఇవాళ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ మూవీ తమిళం, హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
Also Read : అందుకే రాధే శ్యామ్ జనాలకి ఎక్కలేదన్న ఆర్జీవీ