Prathyusha Garimella : ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
షాకింగ్ లో సినీ..ఫ్యాషన్ ఇండస్ట్రీ
Prathyusha Garimella : ఇది ఊహించని వార్త. దేశంలోనే టాప్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా పేరొందిన హైదరాబాద్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకు పాల్పడింది.
శనివారం ఆమె సూసైడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా ఫ్యాషన్, సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంటికి చేరుకున్నారు. వెంటనే ప్రత్యూష(Prathyusha Garimella) మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పంచనామా నిమిత్తం.
ఇదిలా ఉండగా ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభించినట్లు సమాచారం. దీని వల్ల జరిగిందా లేక వేరే ఏమైనా కారణం ఉందా అన్న రీతిలో పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ మేరకు ప్రత్యూష గరిమెళ్ల కేసును అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ప్రత్యూష ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు. దేశంలోనే గుర్తింపు పొందారు. ఆమె బాలీవుడ్, టాలీవుడ్ రంగాలకు చెందిన ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష(Prathyusha Garimella) డ్రెస్సులు రూపొందించారు.
దేశంలో టాప్ 30 మంది లో ప్రత్యూష కూడా ఒకరు. ఆమె సూసైడ్ చేసుకుందన్న వార్త తెలియగానే బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన సినీ నటులు షాక్ కు గురయ్యారు.
ఆమె రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతురు. కాగా ఆమె రాసిన సూసైడ్ నోట్ లో పేరెంట్స్ కు భారం కాలేనని పేర్కొన్నట్లు సమాచారం.
Also Read : సోనాలీ ‘ది బ్రోకెన్ న్యూస్’ సూపర్