Aamir Khan : జెండాలు ఎగరేసిన సినీ ప్రముఖులు
హర్ ఘర్ తిరంగా లో భాగంగా ఇళ్లపై పతాకాలు
Aamir Khan : దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తమ ఇంటిపై ఎగుర వేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా జెండా పండుగ ఘనంగా జరుగుతోంది. ప్రధాని ఇచ్చిన పిలుపునకు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు స్పందించారు.
అమీర్ ఖాన్(Aamir Khan) నుండి హృతిక్ రోషన్(Hrithik Roshan) వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగుర వేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు.
అమీర్ ఖాన్ , హృతిక్ రోషన్ , సల్మాన్ ఖాన్ , అమితాబ్ బచ్చన్ , కంగనా రనౌత్ ముంబై లోని తమ నివాసాలలో జాతీయ జెండాలను ఎగుర వేశారు.
రేపే పంధ్రాగస్టు జరుపుకుంటోంది దేశం. దేశంలోని సామాన్య ప్రజలే కాదు అన్ని వర్గాలు, రంగాలకు చెందిన వారంతా హర్ ఘర్ తిరంగాలో పాల్గొంటున్నారు. ప్రతి ఇంటి వద్ద పతాకం ఉండాలని కోరారు మోదీ.
అమీర్ ఖాన్ తన ఇంటిపై ఎగుర వేశారు. అక్షయ్ కుమార్ , జితేంద్ర, గోవింద, శిల్పా శెట్టి, ధర్మేంద్ర, అనిల్ కపూర్ , సన్నీ డియోల్ , సల్మాన్ ఖాన్ , తదితర నటీ నటులు హర్ ఘర్ తిరంగాలో భాగంగా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు.
త్రివర్ణ పతాకానికి సలాం చేశారు. జాతీయ పతాకం దేశ ఆత్మ గౌరవానికి, త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు ప్రధాన మంత్రి(PM Modi).
Also Read : అబ్బాయికి బాబాయి అభినందన