Atlas Ramachandran : సినీ నిర్మాత అట్లాస్ రామ‌చంద్ర‌న్ మృతి

వ్యాపార‌వేత్త‌గా దుబాయ్ లో రాణింపు

Atlas Ramachandran : కేర‌ళ‌లో జ‌న్మించిన వ్యాపార‌వేత్త , సినీ నిర్మాత అట్లాస్ రామ‌చంద్ర‌న్ దుబాయ్ లో మ‌ర‌ణించారు. ఇత‌ర వ్యాపార‌వ సంస్థ‌ల‌తో పాటు భార‌త‌దేశం, విదేశాల‌లో న‌గ‌ల దుకాణాల‌ను క‌లిగి ఉన్నారు.

రామ‌చంద్ర‌న్ ఆర్థికంగా వెనుక‌బ‌డి 2015లో అరెస్ట్ అయ్యాడు. రామ‌చంద్ర‌న్(Atlas Ramachandran) అనేక మ‌ల‌యాళ చిత్రాల‌ను నిర్మించాడు. అంతే కాకుండా 12 చిత్రాల‌లో సైడ్ రోల్స్ లో న‌టించాడు.

ఆయ‌న‌కు 80 ఏళ్లు. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. నిర్మాత‌, న‌టుడు, వ్యాపార‌వేత్త అట్లాస్ రామ‌చంద్ర‌న్ మృతి ప‌ట్ల కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ తీవ్ర సంతాపం తెలిపారు. వ్యాపార‌, సాంస్కృతిక రంగాల‌లో ఆయ‌న చేసిన సేవ‌లు అపార‌మైన‌వ‌ని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా బ్యాంకుల‌ను మోసం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై దుబాయ్ పోలీసులు అట్లాస్ రామ‌చంద్ర‌న్ ను అరెస్ట్ చేశారు. మూడు సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించారు. రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత విడుద‌ల‌య్యాడు. మూడు ద‌శాబ్దాల కింద‌ట ప్రారంభ‌మైన అట్లాస్ జ్యువెల‌రీ గ్రూప్ కు గ‌ల్ఫ్ దేశాల్లో 40 శాఖ‌లు, కేర‌ళ‌ల‌లో అనేక ఔట్ లెట్లు ఉన్నాయి.

అనంత‌రం అట్లాస్ రామ‌చంద్ర‌న్ రియ‌ల్ ఎస్టేట్ , హెల్త్ కేర్ , ఫిల్మ్ డిస్ట్రిబ్యూష‌న్ లోకి ప్ర‌వేశించాడు. ఆయ‌న తీసిన వైశాలి, సుకృతం చిత్రాలు బాక్సాఫీసు వ‌ద్ద భారీ విజ‌యాలు సాధించాయి. త్రిసూర్ లో బ్యాంకు ఉద్యోగిగా త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. 70ల చివ‌రలో త‌న ఉద్యోగాన్ని విడిచి పెట్టి గ‌ల్ఫ్ కు వెళ్లాడు.

అనేక బ్యాంకుల‌లో ప‌ని చేశాడు. 1980లో స్వంత న‌గ‌ల దుకాణాన్ని ప్రారంభించాడు. మొత్తం 75 శాఖ‌ల‌ను అట్లాస్ ను ప్రారంభించాడు.

Also Read : ఇరాన్ చైనా విమానానికి బాంబు బెదిరింపు

Leave A Reply

Your Email Id will not be published!