Fish Medicine Distribution: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ !
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ !
Fish Medicine Distribution: మృగశిర కార్తె సందర్భంగా ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం 10 గంటకు ప్రారంభమైన ఈ పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. మొత్తం 1,60,000 చేప పిల్లలు సిద్ధం చేయగా… శనివారం 60 వేలకు పైగా భక్తులు చేప ప్రసాదం స్వీకరించారు. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకోని వారికి మరో అవకాశం కల్పించారు బత్తిని సోదరులు. కవాడి గూడ, దూద్ బౌలి లోని తమ నివాసాల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
Fish Medicine Distribution…
ఇక 24 గంటలపాటు సాగిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం… ప్రత్యేక ఏర్పాట్ల మధ్య కొనసాగింది. అయితే.. 30 కౌంటర్లకు పైగా ఏర్పాటు చేసినా క్యూ లైన్లల్లో మహిళలకు, వృద్దులకు, దివ్యంగులకు ప్రత్యేక లైన్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. టోకెన్ తీసుకున్న వారికే చేప మందు ప్రసాదం పంపిణీ చేయడం.. ఉదయం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్దకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు క్యూ కట్టడంతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.
Also Read : Union Cabinet: కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు !