Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి భారీగా తరలివస్తున్న వరద నీరు

మరోవైపు శ్రీశైలం మండలం సున్నిపెంటలో చిరుతపులి సంచారం భయాందోళనలో స్థానికులున్నారు...

Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయ(Srisailam Reservoir) ఇన్ ఫ్లో వచ్చేసి 2,46,965 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో వచ్చేసి 31,784 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 858.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ 100.7085 టీఎంసీలకు చేరుకుంది. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సుంకేసుల జలాశయం మూడు గేట్లు ఎత్తివేసి.. కేసీ కాలువకు 500 క్యూసెక్కులు, శ్రీశైలానికి 500 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఎగువన తుంగభద్ర జలాశయం నుంచి భారీ వరద వస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Srisailam Reservoir…

మరోవైపు శ్రీశైలం(Srisailam) మండలం సున్నిపెంటలో చిరుతపులి సంచారం భయాందోళనలో స్థానికులున్నారు. అర్ధరాత్రి సున్నిపెంటలోని రామాలయం సమీపంలో ఓ గృహంలోకి చిరుత పులి ప్రవేశించింది. ఇంటి ఆవరణం లోపల ఉన్న రెండు పెంపుడు కుక్కలపై చిరుతపులి దాడి చేసింది. ఒక కుక్కను చంపి పడేసిన చిరుతపులి మరోకుక్కను ఎత్తుకెళ్లింది. చిరుతపులి సంచారం వీడియోలు సీపీ కెమెరాలలో రికార్డు అయ్యింది. స్థానికులు భయాందోళనలకు గురైంది. చిరుతపులి సంచరించిన ప్రదేశాలను అటవీశాఖ సిబ్బంది పరిశీలించింది. రాత్రుల సమయాలలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 13.60 అడుగులు వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. 12.55 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. కర్నూలులోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. చింతూరు డివిజన్‌లో వరద ముంపు వీడటం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉగ్రరూపం దాల్చింది. గోదావరి, శబరి నదులు ప్రవహిస్తున్నాయి. పునరావాస కేంద్రాలలో వరద బాధితులు తలదాచుకుంటున్నారు. వరద బాధితులకు బియ్యం కూరగాయలు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.అన్ని వరదముంపు గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

Also Read : Russia-Ukraine War : రష్యా చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుందా..?

Leave A Reply

Your Email Id will not be published!