Asia Cup Stars : ఆసియా కప్ లో ఆ ఐదుగురిపై ఫోకస్
పరుగుల వీరులపైనే అందరి కళ్లు
Asia Cup Stars : ఆగస్టు 27 నుండి మెగా టోర్నమెంట్ ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇక దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు ఆగస్టు 28న జరగనుంది.
అత్యధికంగా పరుగులు చేసిన వారిలో ఐదుగురు టాప్ ప్లేయర్లు(Asia Cup Stars) ఉన్నారు. సెప్టెంబర్ 17 వరకు కొనసాగనుంది ఆసియా కప్. ప్రస్తుతానికి టాప్ స్కోరర్ల లిస్టులో రోహిత్ శర్మ(Rohit Sharma) ఉన్నాడు.
ఈ టోర్నీలో నాయకత్వంతో పాటు పరుగులు చేసేందుకు వేచి చూస్తున్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఇప్పటికే అతడిపై రికార్డు నమోదైంది.
ఇక గత కొంత కాలంగా వరల్డ్ లోనే టాప్ మోస్ట్ క్రికెటర్ గా పేరొందాడు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam). టాప్ టి20 లో అత్యుత్తమ బ్యాటర్ గా వినుతికెక్కాడు.
గత రెండేళ్లుగా వరుసగా టాప్ లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు తన జట్టుకు ఆసియా కప్ అందించే పనిలో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు.
మరో పాకిస్తాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) . ఆ జట్టులో వికెట్ కీపర్. రన్స్ కొల్లగొట్టడంలో తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలకంగా మారాడు.
అతడి ఆటతీరుపై ఓ కన్నేసి ఉంచాయి ప్రత్యర్థి జట్లు. ఇక మరో క్రికెటర్ హజ్రతుల్లా బజాయ్. ఇతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 150కి చేరుకుంది.
ఆఫ్గనిస్తాన్ కు చెందిన ఈ బ్యాటర్ అత్యంత విధ్వంసకరమైన ఆటగాడిగా పేరొందాడు. అతడు గనుక మైదానంలో కూరుకు పోతే ఇక ఆపడం ఎవరి తరం కాదు. మరో కీలక ఆటగాడు బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ అల్ హసన్. అతడు కూడా డేంజరే.
Also Read : ఫామ్ నాకో లెక్క కాదు – రన్ మెషీన్