NV Ramana : దేశాన్ని ఏకం చేసే అంశాలపై దృష్టి పెట్టాలి
విభజించే అంశాలపై పెడితే అశాంతి
NV Ramana : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ(NV Ramana) సంచలన కామెంట్స్ చేశారు. దేశాన్ని విభజించే విషయాలపై కాకుండా దేశాన్ని ఏకం చేసే అంశాలపై ప్రజలు దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
సమైక్యత సమాజంలో ఐక్యతను బలపరుస్తుంది. ఇది శాంతి , పురోగతికి కీలకంగా దోహద పడుతుందన్నారు ఎన్వీ రమణ. మనం మనల్ని ఏకం చేసే సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు.
మనల్ని విభజించే వాటిపై కాదన్నారు. 21వ శతాబ్దంలో చిన్న, సంకుచిత అంశాలు ప్రాధాన్యత సంతరించు కోవడాన్ని సీజేఐ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక సంబంధాలు, మానవ అభివృద్ధిపై ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వారి బంధువుల జీవితాలను గుర్తు చేశారు.
దయచేసి గుర్తుంచుకోండి. మీరందరూ మిలీయనర్లు, బిలియనీర్లు అయి ఉండవచ్చు. కానీ మీరు సంపాదించిన సంపదను అనుభవించాలంటే మీ చుట్టూ శాంతి అన్నది ఉండాలన్నారు.
లేక పోతే అది వృధాగానే ఉంటుందన్నారు. మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా ద్వేషం, హింస లేని సమాజంలో జీవించ గలగాలని చెప్పారు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. భారత దేశం , అమెరికా రెండూ వైవిధ్యానికి ప్రసిద్ది చెందాయన్నారు.
అమెరికా అసాధారణ నైపుణ్యాలతో తనదైన ముద్ర వేయగలుగుతోందన్నారు. ప్రతి ప్రభుత్వ చర్యకు న్యాయపరమైన ఆమోదం లభిస్తుందని అధికారంలో ఉన్న పార్టీ విశ్వసిస్తుందన్నారు.
ప్రతిపక్ష పార్టీలు కారణాలు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాయన్నారు. కానీ రాజ్యంగం పట్ల ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు ఎన్వీ రమణ.
Also Read : ఐఐటీయన్లు కంపెనీలు స్థాపించాలి