Uddhav Thackeray : మనసు నొప్పిస్తే మన్నించండి – ఉద్ధవ్ ఠాక్రే
మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన సీఎం
Uddhav Thackeray : బలపరీక్ష ఎదుర్కోబోతున్న శివసేన పార్టీ చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన బుధవారం మహారాష్ట్ర మంత్రివర్గంతో కీలక భేటీ జరిగింది. రేపటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై తీవ్రంగా చర్చించారు.
శివసేన పార్టీకి చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే ఆద్వర్యంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఆపై వారందరితో కలిసి గుజరాత్ లోని సూరత్ లో బస చేశారు.
అక్కడి నుంచి నేరుగా అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ కు మకాం వేశారు. గత కొన్ని రోజులకు పైగా ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. రెబల్ ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తున్నట్లు నోటీసులు అందజేశారు.
తమపై చర్య తీసుకునే అధికారం డిప్యూటీ స్పీకర్ కు లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు జూలై 12 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ శివసేన పార్టీ విప్ , డిప్యూటీ స్పీకర్ ను ఆదేశించింది.
ఇదే సమయంలో ప్రస్తుత మహా వికాస్ అఘాడీ సర్కార్ మైనార్టీలో పడిందని వెంటనే బల పరీక్షకు పిలవాలంటూ భారతీయ జనతా పార్టీ చీఫ్ , మాజీ సీఎం , ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ కోషియార్ ను కలిసి విన్నవించారు.
వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న గవర్నర్ సీఎంకు బలపరీక్ష చేపట్టాల్సిందింగా ఆదేశించారు. ఈనెల 30న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు.
దీనిని సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రసంగించారు. మనసు నొప్పిస్తే మన్నించండి అంటూ కోరారు. తన వల్ల తప్పు ఏదైనా జరిగితే క్షమించమన్నారు.
Also Read : మీరు మైనార్టీలో ఉన్నారు – గవర్నర్