Sunil Gavaskar : ఛేంజ్ రూమ్ లో కూర్చుంటే ఫామ్ రాదు
విరాట్ కోహ్లీపై సునీల్ గవాస్కర్ ఫైర్
Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సంచలన కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శన చేస్తూ తీవ్ర నిరాశకు గురి చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ , స్టార్ ఇండియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పై నిప్పులు చెరిగాడు.
ఆటపై ఫోకస్ పెట్టక పోవడం వల్లే ఇదంతా జరుగుతోందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛేంజ్ రూమ్ లో కూర్చుంటే ఫామ్ తిరిగి రాదన్నాడు.
ఏం కోల్పోయామో, ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తిస్తేనే బెటర అని సూచించాడు గవాస్కర్(Sunil Gavaskar). ఇదిలా ఉండగా ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో మూడు సార్లు గోల్డెన్ డక్ అయ్యాడు.
ఇక తాజాగా ఇదే వేదికపై సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి సున్నాకే వెనుదిరిగాడు విరాట్ కోహ్లీ. హైదరాబాద్ కు చెందిన బౌలర్ జె సుచిత్ చేతిలో వెనుదిరిగాడు.
ఇప్పటికే ఈ రిచ్ లో తక్కువ పరుగులు చేసిన ముగ్గురిలో కోహ్లీ కూడా ఒకడు. కేవలం హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. అత్యంత పేలవమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేశాడు
. ఆ జట్టు విజయాలు సాధిస్తున్నా కోహ్లీ మాత్రం కంటిన్యూగా ఫెయిల్ కావడంతో ఆటకు విరామం ఇవ్వడం బెటర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా, మాజీ ఆటగాళ్లు సైతం విశ్రాంతి తీసుకోవాలని, ప్రాక్టీస్ చేసి తిరిగి జట్టులోకి వచ్చేలా ప్రయత్నం చేయాలని కోహ్లీకి సూచిస్తున్నారు. ఈ తరుణంలో గవాస్కర్ చేసిన కామెంట్స్ క్రీడా లోకంలో కలకలం రేపాయి.
Also Read : మహరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్