13 New Mandals TS : తెలంగాణలో 13 కొత్త మండలాల ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్
13 New Mandals TS : పాలనా పరంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గాను సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.
ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొత్త మండలాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మరో 13 మండలాలు(13 New Mandals TS) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆయా మండలాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు, కొందరి సూచనల మేరకు వీటిని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొంది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటిని కొత్తగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. నారాయణ పేట జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలో గుండుమాల్ , కొత్త పల్లెను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని దుడ్యాల్ , మహబూబ్ నగర్ జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్లను కొత్త మండలంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో సాలూరను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు.
మహబూబాబాద్ జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలో సీరోల్ , నల్గగొండ జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలో గట్టుప్పల్ , సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లీ , జగిత్యాల జిల్లా పరిధిలో ఎండపల్లి , జగిత్యాల జిల్లా కోరుట్ల రెవిన్యూ డివిజన్ పరిధిలోని భీమారంను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు.
Also Read : ‘ఆజాద్ ..తిలక్’ దేశానికి గర్వకారణం
ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
— Telangana CMO (@TelanganaCMO) July 23, 2022