Johnny Depp : జానీ డెప్ కు మాజీ ఏజెంట్ సపోర్ట్
వృత్తి లేని ప్రవర్తన ఇబ్బంది పెట్టింది
Johnny Depp : ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లో నిలిచారు. ఆయనపై మాజీ భార్య అంబర్ హియర్డ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గృహ హింసకు పాల్పడ్డాడని, తనకు పరువు నష్టం ఇవ్వాలంటూ కోర్టుకు ఎక్కింది.
ఈ సందర్భంగా జానీ డెప్ మాజీ ఏజెంట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన ప్రవర్తన, జీవితం, ఇబ్బందుల గురించి వెల్లడించారు. వృత్తి లేని ప్రవర్తనగా అభివర్ణించారు.
పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 2010 తర్వాత అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ కారణంగా మసక బారడం ప్రారంభించిందని జానీ డెప్ మాజీ ఏజెంట్ ట్రేసీ జాకబ్స్ చెప్పారు. జానీ డెప్(Johnny Depp) అంబర్ హర్డ్ ను ఎప్పుడూ కొట్టలేదని స్పష్టం చేశారు.
ఆమె తరచుగా ఎల్లప్పుడూ హింసాత్మకంగా ఉండేదని సంచలన ఆరోపణలు చేశారు. 2016లో గృహ హింసకు పాల్పడ్డాడని జాన్ డెప్(Johnny Depp) భార్య అంబర్ హియర్డ్ ఆరోపించే కంటే ముందు జానీ డెప్ కెరీర్ , ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ ఆశించినంత బాగా లేవన్నారు.
డెప్ కు మాజీ ఏజెంట్ గా, బిజినెస్ మేనేజర్ గా పని చేశారు. ఈ మేరకు సాక్ష్యం ఇచ్చారు కోర్టు ముందు. హాలీవుడ్ లో ఆయన ప్రాతినిధ్యం వహించిన మూడు దశాబ్దాలలో ప్రపంచంలో అతి పెద్ద స్టార్ గా మారారని అదే ఆయన కొంప ముంచిందన్నారు ట్రేసీ జాకబ్స్.
ప్రొఫెషనల్ బిహేవియర్ ఆయనను ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు. 36 ఏళ్ల టెక్సాస్ లో జన్మించిన హియర్డ్ $100 మిలియన్లు అడిగారు. డెప్ చేతుల్లో ప్రబలమైన శారీరక హింసకు గురైనట్లు వాపోయింది.
Also Read : ‘లయన్ కింగ్’ చూసి ఏడ్చేశా – ప్రిన్స్