Chitra Ramakrishna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ – ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి.
ఎన్ఎస్ఈ కో లొకేషన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలో ఉన్న చిత్రా రామకృష్ణను(Chitra Ramakrishna) అదుపులోకి తీసుకున్న సీబీఐ వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం సీబీఐ కేంద్ర కార్యాలయంలోని లాకప్ కు తరలించారు. ఎన్ఎస్ఈకి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
అంతే కాకుండా సంస్థలోని కీలక సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా, పర్మిషన్ లేకుండానే హిమాలయలో ఉన్న ఓ యోగికి చేర వేసిందన్న ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోంది చిత్రా రామకృష్ణ.
ఇదే సమయంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తులను తన వద్ద ఆఫీసర్లుగా నియమించిందని అక్కడి నుంచే కథ పూర్తిగా నడిపించిందనే విమర్శలు ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి చిత్రా రామకృష్ణను గత నాలుగు రోజుల నుంచి సీబీఐ ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె నివాసంలో జోరుగా తనిఖీలు కూడా జరిపారు.
విచిత్రం ఏమిటంటే విచారణ సందర్భంగా ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా దాట వేస్తోందని తెలిసింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చిత్రా రామకృష్ణను ప్రశ్నించేందుకు గాను సీబీఐ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ కి చెందిన సైకాలజిస్ట్ తో చికిత్స జరిపారు.
కావాలని ఆన్సర్ ఇవ్వడం లేదని తెలియడంతో వెంటనే అరెస్ట్ కు రంగం సిద్దం చేశారు.
Also Read : కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్