Elon Musk-Trump : ఎలాన్ మస్క్, ట్రంప్ ల మధ్య తెగిన స్నేహ బంధం

అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా షెడ్యూల్ ముగిసిందని ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు...

Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బ్రొమాన్స్ ముగిసింది. ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి చెడిందనే ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే మస్క్ డోజ్ పదవికి టాటా చెప్పేశాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించాడు.

Elon Musk – Trump

అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా షెడ్యూల్ ముగిసిందని ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు. ప్రభుత్వంలో వృథా ఖర్చును తగ్గించే అవకాశం కల్పించినందుకు @realDonaldTrump కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో డోజ్ మిషన్ మరింత బలపడి ప్రభుత్వానికి, ప్రజలకు మరింత మేలు చేకూరుస్తుందని ఆకాంక్షించారు. ఎలాన్ మస్క్ ట్రంప్ పరిపాలనా వర్గం నుంచి వైదొలగుతున్నారనే విషయాన్ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. డోజ్ అధిపతిగా ఎలాన్ మస్క్ పదవీకాలం మే 30తో ముగియనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వాన్ని పునర్నిర్మించడానికి DOGE ప్రయత్నాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ట్రంప్ పాలక వర్గ ప్రతినిధి స్పష్టం చేశారు.

Also Read : MSP: వరి సహా 14 పంటలకి మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం

Leave A Reply

Your Email Id will not be published!