G Kishan Reddy : బాపురావు కామెంట్స్ వ్యక్తిగతం
బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి
G Kishan Reddy : బీజేపీకి చెందిన ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. లంబాడీల గురించి ఆయన చులకన చేస్తూ మాట్లాడారు. ఆపై రెచ్చి పోయి వారిని ఎస్టీ జాబితా నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆపై అలా గనుక తొలగించక పోతే తాను ఊరుకోనంటూ హెచ్చరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సోయం బాపురావుపై లంబాడాలు భగ్గుమన్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
G Kishan Reddy Explanation
దీంతో బీజేపీకి ఒక రకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలో లంబాడాలు పెద్ద ఎత్తున ఉన్నారు. వారి ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. దీనిని దృష్టిలో పెట్టుకోకుండా నోరు జారడంపై సోయం బాపురావుపై ఫైర్ అయ్యారు.
ఆయన చేసిన కామెంట్స్ పార్టీ నుంచి చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ పార్టీ చీఫ్ జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy). ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతమని స్పష్టం చేశారు. తమ పార్టీతో సంబంధం లేదన్నారు. తాము గనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎస్టీల రిజర్వేషన్లు మరిన్ని పెంచుతామని చెప్పారు జి. కిషన్ రెడ్డి. మొత్తంగా పార్టీని డ్యామేజ్ కానీయకుండా చేసేందుకు తంటాలు పడుతున్నారు బీజేపీ చీఫ్.
Also Read : Sanju Samson : రాహుల్ వస్తే శాంసన్ పై వేటు