Ganesh Chaturthi : వినాయక చవితి నిమజ్జనం పై సమీక్షించిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో జరుగుతోంది...
Ganesh Chaturthi : వినాయక చవితి ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. వినాయక చవితి, వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ విభాగాల అధినేతలతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల గురించి ఈ రోజు చర్చించామని మీడియాకు వివరించారు. వినాయక చవితి సందర్భంగా గతంలో లోపాలు జరిగాయని, ఆ లోటుపాట్లు లేకుండా ఈ సారి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బోనాల పండగను ఘనంగా నిర్వహించామని.. అదేవిధంగా వినాయక చవితి పండగ, నిమజ్జనం జరిపిస్తామని వివరించారు. వినాయక చవితి, నిమజ్జనానికి సంబంధించి ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో వారం రోజుల్లో సమావేశం అవుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ముంబై అని వివరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు పేరు ఉందన్నారు. హైదరాబాద్ నగర ఇమేజ్ పెంచేలా వినాయక చవితి, నిమజ్జనం జరిగేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వినాయక చవితిలో ప్రజలందరూ భాగస్వామ్యులు అయ్యేలా చేస్తామని వెల్లడించారు. అందరిని కలుపుకొని పండుగను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Minister Ponnam – Ganesh Chaturthi
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో జరుగుతోంది. ఖైరతాబాద్ మహా గణపతి సహా ఇతర వినాయకుల నిమజ్జనం ఇక్కడే చేస్తుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో భారీ గణనాథులను రూపొందిస్తారు. ఇప్పటికే సాగర్ కలుషితం అయ్యింది. వినాయక నిమజ్జనం నేపథ్యంలో మరింత కలుషితం అవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సాగర్‌లో నిమజ్జనానికి గతంలో కోర్టు అనుమతించలేదు. ఇప్పటికిప్పుడు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం కష్టం అవుతోందని చెప్పడంతో గత ఏడాది అవకాశం కల్పించారు. వినాయక నిమజ్జనంపై ఈ సారి హైకోర్టు ధర్మాసనం ఏ విధంగా స్పందించనుందో చూడాలి. నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Also Read : MUDA Scam : సీఎం బీసీ కావడం వల్లే ఇన్ని కుట్రల- డీకే శివకుమార్